Postal GDS 2026 Results Date :
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జనవరి నెలలో విడుదలైన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 28,740+ ఉద్యోగాలకు సంబంధించిన మొదటి మెరిట్ లిస్టు ఫలితాలు విడుదలను పోస్టల్ డిపార్ట్మెంట్ వాయిదా వేసింది. ఫిబ్రవరి 28, 2026 తేదీన విడుదల కావలసినటువంటి ఫలితాలను కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫలితాలను మార్చి మొదటి వారంలోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ పోస్ట్ 2026 షెడ్యూల్ 01 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు మరి కొద్ది రోజుల ఫలితాల కోసం వేచి చూడాల్సిందే. అయితే ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాము.
Postal GDS 2026 1st Merit List Release Date:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు మొత్తం 22 పోస్టల్ సర్కిల్స్ నుంచి విడుదలైన పోస్టల్ జిడిఎస్ 2026 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలను మార్చి మొదటి వారంలోగా ( అనగా మార్చి 7వ తేదీలోగా) విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈరోజు విడుదల చేయవలసిన ఫలితాలను పోస్టల్ డిపార్ట్మెంట్ వాయిదా వేసింది.
How To Download Postal GDS 2026 1st Merit List Results:
పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్టు ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా పోస్టల్ జిడిఎస్ 2026 అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్లండి
- వెబ్సైట్ హోం పేజ్ లో “Postal GDS 2026 1st Merit List Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అక్కడ పోస్టల్ సర్కిల్ వారిగా రాష్ట్రాల యొక్క ఫలితాలకు సంబంధించిన పిడిఎఫ్ ఉంటాయి.
- మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించిన లింకు పైన క్లిక్ చేయండి
- వెంటనే మొదటి మెరిట్ లిస్టు ఫలితాలు స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతాయి.
- మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే, మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఐడి లేదా మీ యొక్క పేరు లిస్టులో ఉంటుంది.
- లిస్టులో పేరు ఉన్నవారు గడువులోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి.
Postal GDS 2026 Results Website
2nd Merit List Release Date After 1st Merit List Released:
ఒకసారి పోస్టల్ జిడిఎస్ 2026 ఉద్యోగాలకు సంబంధించిన మొదటి మెరిట్ లిస్టు ఫలితాలు విడుదలైన తర్వాత, ఆ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే రెండవ మెరిట్ లిస్టు పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేస్తుంది. అనగా మొదటి మెరిట్ లిస్ట్ కి మరియు రెండవ మెరిట్ లిస్ట్ కి మూడు వారాల వరకు సమయం కేటాయిస్తారు. ఇలాగా మొదటి మెరిట్ లిస్ట్ నుండి 5 లేదా ఆరో మెరిట్ లిస్టు వరకు ఫలితాలను విడుదల చేసి పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చినటువంటి వారికి, ఈ పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు ఇస్తారు.
పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు 2026 ఉద్యోగాల యొక్క ఫలితాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.