Postal Jobs New Notification 2026:
పోస్టల్ డిపార్ట్మెంట్ ముంబై నుండి 11 స్కిల్డ్ ఆర్టిజన్స్, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రీయల్ ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం, దేశంలోని అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు 8వ తరగతి లేదా పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లలో విద్యార్హతలు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మోటార్ మెకానిక్ పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.
నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ |
| మొత్తం పోస్టులు | 11 |
| పోస్టుల పేర్లు | స్కిల్డ్ ఆర్టిజన్స్ |
| విద్యార్హతలు | ఎనిమిదవ తరగతి లేదా పదో తరగతి |
| ఆఖరి తేదీ | మార్చి 31, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
తపాలా శాఖ నుండి విడుదలైన స్కిల్ద్ ఆర్టిజన్స్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 8వ తరగతి లేదా పదవ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడులలో విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే మోటార్ మెకానిక్ పోస్టులకు అప్లై చేసుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి.
ఎంత వయస్సు?:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కూడా కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఈ పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించవలెను. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత శాలరీ ఉంటుంది?:
పోస్టల్ గ్రూప్ సి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు 35 వేల రూపాయల వరకు స్టార్టింగ్ లోనే జీతాలు చెల్లిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్ :
పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు సంబంధిత అడ్రస్ కి ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి
- అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్:
అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు దరఖాస్తులను పంపించవలెను.
- THE SENIOR MANAGER, MAIL MOTOR SERVICE, 134-A, SUDAM KALU AHIRE MARG, WORLI, MUMBAI- 400018
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు పైన తెలిపినటువంటి అడ్రస్ కి అప్లికేషన్ ని గురించి గడువులోగా పంపించవలెను.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
| నోటిఫికేషన్ విడుదలైన తేదీ | 20 ఫిబ్రవరి, 2026 |
| అప్లికేషన్ ఆఖరి తేదీ | మార్చ్ 31, 2026 |
| నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం | Download |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల అయ్యే ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.