AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షల్లో అర్హత పొంది అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా పాస్ అయినటువంటి విద్యార్థులు, జూలై 6వ తేదీ నుండి అధికారిక ఎంసెట్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలని ఏపీ ఎంసెట్ 2025 కన్వీనర్ ఆదేశాలు జాబ్ చేశారు. కొంతమంది విద్యార్థులకు ఏపీ ఎంసెట్ 2025లో పరీక్షలు రాసినా కూడా ర్యాంకు రాని విద్యార్థులకు ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించడం కష్టం కాబట్టి, అలాంటి విద్యార్థులకు కూడా మరొక అవకాశం కల్పిస్తూ, వారి యొక్క ఇంటర్ మార్కులను మరియు ఇతర పూర్తి వివరాలన్నీ కూడా డిక్లరేషన్ ఫారం లో నమోదు చేసి సబ్మిట్ చేసే విధంగా జూలై 6వ తేదీ నుండి సమయం కేటాయించారు. కాబట్టి ఏపీ ఎంసెట్ 2025 పరీక్షలు రాసిన ప్రతి ఒక్కరు అధికారిక వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారం ఓపెన్ చేసి మీ యొక్క వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి. కొత్తగా వచ్చిన ఈ సమాచారం గురించిన వివరాలు చూద్దాం.
డిక్లరేషన్ ఫారం ఎందుకు సబ్మిట్ చేయాలి?:
ఏపీ ఎంసెట్ 2025 పరీక్షలు రాసినా ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ మళ్లీ ఈ డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయాలని అధికారులు సూచించారు. జూలై ఏడో తేదీ నుండి 16వ తేదీ మధ్యన ఏపీ ఎంసెట్ 2025 షెడ్యూల్ ఉన్నందున, విద్యార్థులు ర్యాంకులు లేకుండా ఎంసెట్ షెడ్యూల్లో పాల్గొనలేరు కాబట్టి, ఎంసెట్ పరీక్షలు అర్హత పొంది కూడా ర్యాంకులు రానివారు కచ్చితంగా ఈ ఫారంని పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
- ఆన్లైన్ డిక్లరేషన్ ఫారం ఓపెన్ అయ్యే తేదీ: జులై 6, 2025 నుంచి ఈ ఫారం పూర్తి చేయాలి (తప్పనిసరిగా)
AP EAMCET 2024 Last Cut Off Ranks List విడుదల చేశారు: డౌన్లోడ్
How to Fill AP EAMCET declaration form:
ఇంటర్ పరీక్షలు అర్హత పొంది, అలాగే ఏపీ ఎంసెట్ పరీక్షల్లో అర్హత పొందిన కూడా ర్యాంకు రాని విద్యార్థులు ఈ క్రింది విధంగా డిక్లరేషన్ ఫారం ని పూర్తి చేయండి.
AP ఎంసెట్ 2025లో 20,000 నుండి 1,80,000 మధ్య ర్యాంక్ వచ్చినవారికి ఏ కాలేజెస్ లో సీట్ వస్తుంది.
- ముందుగా AP EAMCET 2025 అధికారిక వెబ్ సైట్ లోనికి వెళ్ళండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో “Declaration Form” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- స్క్రీన్ పైన ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులోని వివరాలన్నీ పూర్తి చేసి సబ్మిట్ చేయండి.
- ఈ ఫామ్ ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ, ఎంసెట్ పరీక్ష రాసిన వారందరూ తప్పనిసరిగా పూర్తి చేయాలి
AP EAMCET 2025 Declaration Form
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 డిక్లరేషన్ ఫారం ని ఎవరు పూర్తి చేయాలి?
ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి అలాగే ఎంసెట్ పరీక్షలు కూడా రాసిన విద్యార్థులు డిక్లరేషన్ ఫారం ని పూర్తి చేయాలి
2. డిక్లరేషన్ ఫారం పూర్తి చేయడానికి, ఫారం ఓపెన్ అయ్యే తేదీ?
జూలై 6వ తేదీ నుండి డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేయడానికి సంబంధించిన లింక్ యాక్టివేట్ చేస్తారు. అప్పటినుండి మీ యొక్క ఇంటర్ మార్క్స్ ని డిక్లరేషన్ ఫామ్ లో పూర్తిచేసే సబ్మిట్ చేయాలి