తెలంగాణ రైతు భరోసా 2025 డబ్బులు విడుదల చేశారు: మీకు డిపాజిట్ అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకోండి.

By: Sivakrishna Bandela

On: June 16, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana rythu Bharosa scheme 2025:

తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసానిధులను ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. జూన్ 17వ తేదీ నుండి డబ్బులు జమ అవుతాయని ముందు చెప్పినప్పటికీ, ఈ రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి 70,11,984 మంది రైతులకు వారి ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు. ఈ పథకానికి మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులందరికీ వారం రోజుల్లో ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డిపాజిట్ అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.

ఎంత మొత్తం విడుదల చేశారు?:

• ఈసారి రైతు భరోసా కింద ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు: 9,000 కోట్లు. ఈ మొత్తం నిధులు 70,11,984 మంది రైతుల ఖాతాల్లోకి డిపాజిట్ కానున్నాయి. మొత్తం వారం రోజుల్లో ఈ డబ్బులన్నీ అర్హులైనటువంటి లబ్ధిదారుల అకౌంట్లోకి జమ కావడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Join WhatsApp group

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

ఎవరికి లభించనుంది?:

  • 70,11,984 మంది రైతుల అకౌంట్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి
  • 49 లక్షల పైగా ఎకరాలు ఉన్న రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ అవుతాయి.
  • భూములపై రైతులకు హక్కు లేకపోయినా,అన్నదాతలకు ఈ డబ్బులు అందించనున్నారు.
  • ఎలాంటి లబ్ధిదారుల జాబితా పరిశీలన లేకుండానే, సరైన నెంబర్, బ్యాంకు ఖాతా ఉన్నవారికి డైరెక్ట్ గా నిధులు జమవుతాయి.

తెలంగాణ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితా విడుదల:Click Here

డబ్బులు డిపాజిట్ అయ్యాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?:

రైతులు ఈ రైతు భరోసా పథకం కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్ కు SMS వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ లో మొత్తం ఎంత డబ్బులు వారి యొక్క అకౌంట్లో డిపాజిట్ అయ్యాయో తెలుస్తుంది.లేదా రైతులు వారి యొక్క బ్యాంక్ app, UPI అకౌంట్స్ ద్వారా కూడా నిధులు జమ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.

పోస్టల్ GDS 2025 రిజల్ట్స్ :AP, TS 4th మెరిట్ లిస్టు విడుదల చేశారు

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు మొత్తం తొమ్మిది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాలోకి జమ అవుతాయని, వెంటనే డబ్బులు జమకాని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని, తొమ్మిది రోజులు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేశారు.

అధికారుల ప్రకటన:

వివిధ పద్ధతుల్లో ఈ డబ్బుల వితరణ చేస్తామని, ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు అధికారులు రైతులకు ఈ రైతు భరోసా పథకం నిధులు విడుదలకు సంబంధించిన వివరాలను రైతులకు వివరించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. వచ్చే రోజుల్లో మిగిలిన రైతులకు కూడా ఈ డబ్బులు జమవుతాయని అధికారులకు వివరించడం జరిగింది.

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

ఏపీలో 10.42 లక్షల ఇళ్ళ మంజూరు – లబ్ధిదారుల జాబితా విడుదల | AP PMAY Gramin 2.0 Beneficiary List 2026 | Check Full Details

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

Translate »

You cannot copy content of this page