AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి (AP Thalliki Vandanam Scheme 2025) సంబంధించి ఒక పెద్ద శుభవార్త. జూన్ 12వ తేదీన ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించి 12వ తేదీ వరకు పూర్తి అర్హతలు కలిగినటువంటి వారికి ఈరోజు ఉదయం నుండి 13వేల రూపాయలు అకౌంట్ లో డిపాజిట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి డిపాజిట్ అయిన చాలామంది అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా డిపాజిట్ అవుతున్న అమౌంట్ కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ ని షేర్ చేస్తున్నారు.అయితే కొంతమంది సరైన పత్రాలు సబ్మిట్ చేయకపోవడం వల్ల అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అర్హులు మరియు అనర్హుల జాబితాను గ్రామ సచివాలయంలో చెక్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనర్హుల జాబితాలో ఉన్నవారు మళ్లీ అప్లై చేసుకునే విధంగా అవకాశం కూడా కల్పిస్తోంది.దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బులు డిపాజిట్ కాని వారు ఏమి చేయాలి?:
- మీరు అర్హులు అయి ఉండి కూడా మీకు తల్లికి వందనం పధకం డబ్బులు రాలేదంటే:
- మీ గ్రామ సచివాలయంలోని అధికారిని సంప్రదించండి.
- NBM (Navasakam Beneficiary Management) పోర్టల్ ద్వారా మీ పేరు ఆ లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేయండి.
- సర్వే చేసిన వారితో మీ వివరాలను రీ వెరిఫై చేయించండి.
మీ పేరు లిస్టులో లేకపోతే ఇలా చేయండి:
- మీరు తప్పనిసరిగా గ్రీవెన్స్ / అభ్యంతరాల ఫారంను పూర్తి చేసి సచివాలయంలో సబ్మిట్ చేయాలి.
- ఈ ఫారం ను గ్రామ సచివాలయ సిబ్బంది సహాయంతో పూరించి, కావలసిన సర్టిఫికెట్స్ కూడా పొందుపరిచి అక్కడి అధికారులకు సబ్మిట్ చేయాలి.
తల్లికి వందనం పథకం: Eligible & Ineligible List: మీ పేరు ఉందో లేదో చూసుకోండి
కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
తల్లికి వందనం పథకానికి మీరు కొత్తగా అప్లై చేయాలి అంటే ఈ క్రింది విధంగా ఫాలో అవ్వండి :
- గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లండి.
- మీ పేరుతో లింక్ అయినా ఆధార్ కార్డ్, ఆధార్ తో లింక్ అయినా బ్యాంకు ఖాతా నెంబర్, పుట్టిన తేదీ సర్టిఫికెట్ వంటి వివరాలను సబ్మిట్ చేయాలి.
- అప్పుడు మీ పేరు GSWS/NBM పోర్టల్ లో నమోదు అవుతుంది.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు ఎప్పుడు డిపాజిట్ అవుతాయి?:
తల్లికి వందనం పథకం 15000 కాదు 13000 మాత్రమే: మీ స్టేటస్ చెక్ చేసుకోండి
ప్రభుత్వం జూన్ 12, 2025న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం:
- ప్రాథమిక జాబితా ప్రకారం జూన్ 12వ తేదీ నాటికి అర్హులైనటువంటి వారికి మొదటి విడత డబ్బులు డిపాజిట్ ప్రారంభమైంది.
- కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి, వారి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జూలై 5వ తేదీ నాటికి డబ్బులు డిపాజిట్ అవుతాయి.
ముఖ్యమైన లింక్స్:
- లబ్ధిదారుల లిస్టు చెక్ చేసుకునేందుకు https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- కచ్చితంగా గుర్తు పెట్టుకోండి : మీ బ్యాంకు ఖాతా నంబరు ఆధార్ తో లింక్ అయి ఉండాలి.
- గ్రామ సచివాలయం అధికారి సర్వే తప్పనిసరి.
ఏపీ తల్లికి వందనం పథకానికి కొత్తవారిలా అప్లై చేయండి
డబ్బులు డిపాజిట్ అయినా స్క్రీన్ షాట్ ప్రూఫ్:
తల్లికి వందనం పథకానికి అర్హులైన వారికి ఈరోజు ఉదయం ₹13,000/- డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఈ క్రింది స్క్రీన్ షాట్ ప్రూఫ్ చెక్ చేయగలరు.


ఈ పథకానికి సంబంధించిన ఏ పక్కా సమాచారం వచ్చినా, ప్రభుత్వం జారీ చేసిన జీవో, షెడ్యూల్, బులిటెన్లు ఆధారంగా మాత్రమే నమ్మకం ఉంచండి.