AP EAMCET 2025 Re-Ranking:
ఏపీ ఎంసెట్ 2017 ఫలితాలు విడుదల ఇప్పటికి మూడు రోజులు కావస్తోంది. అయితే చాలామంది 10+2 విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను ఆన్లైన్లో డిక్లరేషన్ ఫారంలో అప్లోడ్ చేయకుండా నిర్లక్ష్యం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారికంగా వెల్లడించింది. ఈ కారణం వల్ల దాదాపు 15 వేల మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయించబడలేదు. కావున ఎవరైతే 10+2 మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు వారు త్వరితగతన అప్లోడ్ చేయాలి అని EAPCET కన్వీనర్ V.V. సుబ్బారావు గారు తెలిపారు. ఇదే ఆఖరి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇంటర్ మార్కులను అప్లోడ్ చేయండి.
AP EAPCET కన్వీనర్ VV సుబ్బారావు తెలిపినటువంటి వివరాల ప్రకారం, కొన్ని బోర్డులకు చెందిన చెందిన ఇంటర్ విద్యార్థులు, వారి యొక్క ఇంటర్ మార్కుల వివరాలను డిక్లరేషన్ ఫారం లో అప్లోడ్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని తెలిపారు. ఈ కారణం చేత ర్యాంకుల కేటాయింపు నిలిచిపోయిందని, ముఖ్యంగా తెలంగాణ బోర్డుకి చెందిన ఇంటర్ విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను AP EAPCET వెబ్సైట్లో అప్లోడ్ చేయవలసిందిగా కోరడం జరిగింది.
AP EAMCET 2025 Below 10,000 Rank Expected Colleges list
ఎవరు తప్పకుండా అప్లోడ్ చేయాలి?:
ఈ క్రింది తెలిపిన ఇంటర్ బోర్డుల విద్యార్థులు ఇప్పటివరకు వారి యొక్క ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సర మార్కుల వివరాలను అప్లోడ్ చేయనట్లయితే కచ్చితంగా అప్లోడ్ చేయాలి.
- TGBIE ( తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు )
- CBSE/ICSE విద్యార్థులు
- APOSS ( ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ విద్యార్థులు)
- NIOS విద్యార్థులు
- డిప్లమా విద్యార్థులు
- ఇతర రాష్ట్రాల బోర్డులకి చెందిన విద్యార్థులు అప్లోడ్ చేయాలి.
ఎలా అప్లోడ్ చేయాలి?:
ఇతర ఇంటర్ బోర్డులకి చెందినటువంటి విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కుల వివరాలను ఆంధ్రప్రదేశ్ AP EAPCET వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారం ద్వారా లాగిన్ అయ్యి, వీలైనంత త్వరగా మార్కుల వివరాలను నమోదు చేయాలి.
AP EAMCET 2025 rank 5000 to 150000 colleges list
ఇంటర్ మార్కులు అప్లోడ్ కి కావలసిన వివరాలు
- 10+2 ఇంటర్ మార్క్స్ మెమోలు
- రిజిస్ట్రేషన్ నెంబర్
- హాల్ టికెట్ నెంబర్
- మొబైల్ నెంబర్
- ఇతర గుర్తింపు వివరాలు ఉండవలెను.
ముఖ్యమైన గమనిక ఏమిటంటే?:
మీ ఇంటర్ మార్కుల వివరాలను అప్లోడ్ చేయకుంటే మీకు Ap EAPCET ర్యాంకు కేటాయించబడదు. ఎంసెట్లో ర్యాంకు లేనివారికి కౌన్సిలింగ్ కు హాజరు కావడానికి వీలు ఉండదు. కావున వెంటనే మీ యొక్క ఇంటర్ మార్కులను అప్లోడ్ చేయడం అత్యంత కీలకమైన విషయం.
సహాయం కొరకు సంప్రదించండి:
ఇంటర్ మార్కులను డిక్లరేషన్ ఫారం లో అప్లోడ్ చేసే క్రమంలో ఏదైనా సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే, విద్యార్థులు APCHE అధికారులను ఈ క్రింది కాంటాక్ట్ డిటెయిల్స్ ద్వారా సంప్రదించవచ్చు.
884-2359599/2342499
helpdeskapeapcet@apsche.org
ఈ ముఖ్యమైన సమాచారాన్ని ఇంటర్మీడియట్ చదివి ఏపీ ఎంసెట్ పరీక్ష రాసిన మీ మిత్రులందరికీ షేర్ చేయండి.