AP schools Academic calendar 2025-26 released : school holidays, exams, working days details:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 26 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలండర్ ని అధికారికంగా విడుదల చేసింది. ఈ క్యాలెండర్ లో తెలిపిన ప్రకారం 233 పని దినాలు, 83 సెలవులు ఉండనున్నాయి .అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరీక్షల షెడ్యూల్, సెలవులు, ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం పూర్తి వివరాలు చూడండి. ఈ ఆర్టికల్ పూర్తిగా చూసి AP schools academic calendar 2025-26 full details తెలుసుకోండి.
ఏపీ అకడమిక్ క్యాలెండర్ 2025-26 ముఖ్యమైన వివరాలు:
ఏపీ అకడమిక్ క్యాలెండర్ 2025-26 ముఖ్యమైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- మొత్తం పని దినాలు :233
- మొత్తం సెలవులు: 83
- అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యేది: జూన్ 2025
- అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేది : మార్చ్ / ఏప్రిల్ 2026( అధికారిక తేదీలు ఇంకా తెలియాల్సి ఉంది)
ఈ ఏడాది పాఠశాల విద్యలో బిగ్ చేంజెస్ : స్కూల్స్ రీ ఓపెన్ డేట్ ఇదే
ముఖ్యమైన సెలవు దినాలు 2025-26:
ప్రైమరీ పాఠశాలల సెలవుల వివరాలు:
- 2025 సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు : దసరా సెలవులు
- 2026 జనవరి 10 నుండి జనవరి 18 వరకు : సంక్రాంతి సెలవులు
- 2025 డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 28 వరకు: క్రిస్మస్ సెలవులు
పరీక్షల షెడ్యూల్ ( ఎక్స్పెక్టెడ్ డేట్స్ ):
- FA1,FA2,SA1,SA2 పరీక్షల తేదీలను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు త్వరలో విడుదల చేయనున్నారు.
- ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు పదో తరగతి 2026 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని సపరేట్గా విడుదల చేస్తారు.
తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:
- ఒక మంచి హాజరు పొందాలి అంటే ముందుగానే ఫెస్టివల్స్ మరియు విహార యాత్రలకు ప్లానింగ్ చేసుకోవడం వల్ల కుదురుతుంది.
- ఎక్కడ మీకు క్యాలెండర్ ని స్కూల్స్ తప్పనిసరిగా పాటించాలి
- ఏమైనా ఎలక్షన్స్ జరిగిన లేదా ఇంకా ఇతర కారణాలవల్ల షెడ్యూల్లో మార్పులు ఉన్నట్లయితే ముందుగానే విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది.
Sources and references:
- official AP School Education Department circular
- press note from CSE AP
- verified from way2news.com and other reliable local news portals