AP Inter Supplementary Exams 2025:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల కోసం మే నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాత పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించారు. ఈరోజు నుంచి అనగా మేము 12వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 గంటల వరకు రెండవ సంవత్సరం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు మే ఆరో తేదీన విడుదల చేశారు. ప్రాతపరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చు. మే 20వ తేదీన ఈ పరీక్షలు ముగిసిన తర్వాత వారం రోజుల్లో గానే అనగా మే నెల చివరివారంలో ఫలితాలు విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను మే చివరి వారంలో విడుదల చేయమన్నారు. మే 12వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సప్లమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలి. మొత్తం మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు సప్లమెంటు రాత పరీక్షలకు ఫీజు చెల్లించారు.
సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది విధంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.
- ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ వెబ్సైట్ (www.bie.ap.gov.in) ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజీలో ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ కి సంబంధించిన లింక్ ఉంటుంది ఆ లింకు పైన క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే హాల్టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి
- వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
FAQ’s:
1. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ రాత పరీక్షల తేదీలు ఏమిటి?
మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు
2. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ రాత పరీక్షల ఫలితాలు విడుదల ఎప్పుడు?.
మీ చివరి వారంలో ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.