Telangana District Court Jobs Notification 2025:
తెలంగాణా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, సిద్దిపేట నుండి స్టెనోగ్రాఫర్ / టైపిస్ట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లో 120wpm స్కిల్స్ కలిగిన గవర్నమెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి సర్టిఫికెట్ పొంది మరియు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్స్ 45wpm ఇంగ్లీష్ లో కలిగిన వారు అర్హులు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 40 మార్కులకు రాత పరీక్ష, షార్ట్ హ్యాండ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అర్హతలు వివరాలు చూడగలరు
నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్:
తెలంగాణా జిల్లా కోర్టు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 7th మార్చి 2025 |
అప్లికేషన్ ఆఖరు తేదీ | 15th ఏప్రిల్ 2025 |
రాత పరీక్ష నిర్వహించే తేదీ | 3rd మే 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
తెలంగాణా జిల్లా కోర్టు, సిద్దిపేట ఉద్యోగాలకు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. SC, ST, OBC, EWS రిజర్వేషన్ ఉన్నవారికి మరో 05 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు
పోస్టులు వివరాలు, అర్హతలు:
సిద్దిపేట జిల్లాలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్టు నుండి ఖాళీగా ఉన్న స్టెనో / టైపిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి స్టెనయోగ్రఫీ సర్టిఫికెట్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగినవారు అర్హులు.
అప్లికేషన్ ఫీజు :
సిద్దిపేట జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునేవారు OC, BC అభ్యర్థులైతే ₹800/- ఫీజు మిగిలిన SC, ST అభ్యర్థులు ₹400/- ఫీజు చెల్లించాలి. ది సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిద్దిపేట పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తియ్యాలి. అప్లికేషన్ తో పాటు DD రెసెప్ప్ట్ కూడా పంపించవలెను.
సెలక్షన్ ప్రాసెస్:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు Apply చేసినవారికి 40 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. అందులో 20 మార్కులు జనరల్ నౌలెడ్జి, 20 మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు వస్తాయి.అలాగే స్కిల్ టెస్ట్ 40 మార్కులకు, ఓరల్ ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.
ఏపీ జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్: Apply
శాలరీ వివరాలు:
జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి నెలకు ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
సర్టిఫికెట్స్ లిస్ట్:
పూర్తి చేసిన అప్లికేషన్, DD ఫారం ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్
1st నుండి 7th క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్
క్యాస్ట్ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా అప్లై చెయ్యాలి?:
తెలంగాణా జిల్లా కోర్టు జాబ్స్ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.