TGSRTC 1,500 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | TGSRTC Notification 2025 | Freejobsintelugu

TGSRTC Notification 2025:

తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC నుండి 1,500 పోస్టులతో డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి సర్కులర్ జారీ చేస్తూ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు చదవడం, రాయడం వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ వివరాలు:

తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ల కొరత తీర్చడానికి 1500 పోస్టులతో మొదటిసారిగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోని సర్కులర్ జారీ చేయడం జరిగింది.

Join Whats App Group

పోస్టుల అర్హతలు:

తెలంగాణా TGSRTC Driver ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు హెవీ వెహికిల్ లైసెన్స్, భారీ వాహనాలు నడపడం లో 18 నెలల అనుభవం ఉండాలి. ఎత్తు 100 సెం మీ.కు తగ్గకుండా ఉండాలి. ఏదైనా ప్రాంతీయ భాషలో చదవటం, రాయటం వచ్చి ఉండాలి. 60 ఏళ్లలోపు వారై ఉండాలి.

గృహ నిర్మాణ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్

సెలక్షన్ ప్రాసెస్:

TGSRTC డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కార్డు కలిగి ఉంటే కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తారు. అభ్యర్థులను మ్యాన్ పవర్ సప్లైయింగ్ సంస్థల నుండి తీసుకుంటే అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు ఉండదు.

అప్లికేషన్ ఫీజు:

TGSRTC డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు .

వ్యవసాయ శాఖలో 12th అర్హతతో ఉద్యోగాలు: Apply

శాలరీ ఎంత ఉంటుంది?:

TGSRTC ఉద్యోగాలకు డ్రైవర్లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹22,415/- శాలరీ చెల్లిస్తారు. ఎంపిక అయినవారికి ముందుగా 2 వారాలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో రోజుకి ₹200/- చెల్లిస్తారు

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th పాస్ / ఫెయిల్ సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

Income Tax డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా Apply చేసుకోగలరు.

Join Whats App Group

Notification Details Update PDF

Official Website

TGSRTC ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు

Leave a Comment

error: Content is protected !!