TGSRTC Notification 2024:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC నుండి 3,038 పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో 2000 డ్రైవర్ జాబ్స్, డిపోట్ మేనేజర్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, డిప్యూటీ సూపరింటెండెంట్, శ్రమిక, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే Apply చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
TGSRTC నుండి 3,038 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఇందులో డ్రైవర్, శ్రామిక, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ee ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కొన్ని పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా, మరికొన్ని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసే అవకాశం ఉంటుంది.
నవోదయ విద్యాలయాల్లో 6,700 Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో మరో 05 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
TGSRTC ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹19,000/- నుండి ₹40,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
తెలంగాణా రెవెన్యూ శాఖ 10,965 VRO జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు ఫీజు వివరాలు అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రకటనలో ఇచ్చిన ఫీజు వివరాల ఆధారంగా కేటగిరీల అభ్యర్థులు చెల్లించాలి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
TGSRTC ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశాక Apply చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
డ్రైవర్ జాబ్స్ కి డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
1st నుండి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రెసిండెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
TGSRTC నుండి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
TGSRTC ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారికి అవకాశం ఉంటుంది.