Telangana Govt. Jobs Notification 2024:
తెలంగాణా ప్రభుత్వ సంస్థ మెడికల్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ నుండి జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
జూనియర్ అసిస్టెంట్: 01 పోస్ట్ : ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2022 TSPSC పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు
విజిలెన్స్ ఆఫీసర్ : 02 పోస్ట్ : ఏదైనా డిగ్రీ అర్హత కలిగి LLB డిగ్రీ కూడా చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 44 సంవత్సరాలు, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు 24 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
ఎంత శాలరీ ఉంటుంది :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా TSPSC గ్రూప్ 4 2022 నోటిఫికేషన్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇస్తారు.
సికింద్రాబాద్, విజయవాడ రైల్వేలో Govt జాబ్స్ : 10+2 అర్హత
జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ చేయలవలసిన వర్క్:
జూనియర్ అసిస్టెంట్ విధులు:
అప్లికేషన్స్ ని రిసీవ్ చేసుకొని, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం వంటి వర్క్ ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్టర్స్ ఎంట్రీస్, ఇతర సర్టిఫికెట్స్ చెక్ చేసే వర్క్ ఉంటుంది.
విజిలెన్స్ ఆఫీసర్ విధులు:
క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ ని విజిట్ చేసి చెక్ చేయడం వంటి పనులు ఉంటాయి.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1,000/- ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణా స్టేట్ మెడికల్ కౌన్సిల్, హైదరాబాద్ పేరు మీద DD తీసి సబ్మిట్ చెయ్యాలి.
ఎలా అప్లై చెయ్యాలి:
అభ్యర్థుల బయో డేటా, అర్హత సర్టిఫికెట్స్, ఫీజు DD స్లిప్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, ఇతర డాక్యుమెంట్స్ అన్ని కలిపి పోస్ట్ ద్వారా ఆఫీస్ ఆఫ్ ది తెలంగాణా మెడికల్ కౌన్సిల్, హైదరాబాద్ కు పంపించాలి.
ముఖ్యమైన తేదీలు:
25th అక్టోబర్ నుండి 11th అక్టోబర్ మధ్యన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
తెలంగాణా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Apply చేసుకోగలరు.