Telangana Govt Jobs 2024:
తెలంగాణా మెడికల్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి 371 గవర్నమెంట్ జాబ్స్ విడుదల చేస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చెసుకోవాలి. 99 ఫార్మసిస్ట్, 272 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్స్ లోని పోస్టులను పెంచుతూ ఈ Addendum నోటీసుని జారీ చేయడం జరిగింది. 14th అక్టోబర్ లోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ నెలలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. కొత్తగా విడుదలయిన నోటీసు లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్స్ ని 14th అక్టోబర్ తేదీలోగా చేసుకోవాలి. ఆఖరు తేదీ గడువు పెంచే అవకాశం లేదు. కావున అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply
పోస్టుల వివరాలు , వాటి అర్హతలు:
తెలంగాణా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి గతంలో విడుదలయిన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులకు అనుబంధంగా మరో 371 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలను అదనంగా కలుపుతూ కొత్త నోటిఫికేషన్ నోటీసు జారీ చేశారు. ఈ పోస్టులకు GNM నర్సింగ్, BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులు స్టాఫ్ నర్స్ పోస్టులకు అర్హులు, 99 ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు D. ఫార్మసీ, B.ఫార్మసీ చేసినవారు అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ నెల 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చెయ్యాలి.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు స్టేట్ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి. TA, DA, HRA వంటి బెనిఫిట్స్ ఉంటాయి.
AP కాటన్ కార్పొరేషన్ లో పరీక్ష లేకుండా అసిస్టెంట్ జాబ్స్
పరీక్ష విధానం:
స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి. Core టాపిక్స్ పైన ఇంగ్లీష్ లో రాత పరీక్ష పెడతారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th మార్క్స్ మెమో ( డేట్ ఆఫ్ బర్త్ కొరకు).
స్టాఫ్ నర్స్, ఫార్నసిస్ట్ పూర్తి చేసిన అర్హత సర్టిఫికెట్స్
తెలంగాణా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకున్న సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా అప్లికేషన్ చేసుకోవాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత అర్హత కలిగినవారు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ఆధారంగా దరఖాస్తు చేసుకోగలరు.
Notification PDF – Addendum Notice
Full Notifications & Apply Links
తెలంగాణాలోని 371 పోస్టులకు apply చేసుకోవడానికి ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది.