పోస్టల్ శాఖ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Postal IPPB Executive Jobs Notification 2024 | Freejobsintelugu

Postal Jobs Notification 2024:

పోస్టల్ శాఖకు సంబందించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ IPPB నుండి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబందించిన పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో వచ్చిన మెరిట్ మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ / మోడిఫికేషన్ తేదీలు : 11th అక్టోబర్ 2024 నుండి 30st అక్టోబర్ 2024

అప్లికేషన్ చేసే ఆఖరు తేదీ : 31st అక్టోబర్ 2024

AP కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు : No Exam

ఉద్యోగాల వివరాలు, అర్హతలు:

ఇండియాన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 344 పోస్టులతో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ ఉద్యోగాలకు ఇంతకు ముందు GDS లుగా ఉద్యోగాలు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి పూర్తి చేసినట్లయితే దరఖాస్తు చేసుకోగలరు.

వయో పరిమితి ఎంత ఉండాలి:

20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

వ్యవసాయశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు: No Exam

అప్లికేషన్ ఫీజు:

అర్హతలు కలిగిన అభ్యర్థులు ₹750/- నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ఎటువంటి రిఫండ్ చేయడం జరగదు. అన్ని కేటగిరీలవారు ఫీజు చెల్లించాలి.

సెలక్షన్ ప్రాసెస్:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ విధానంలో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అవసరం అనుకుంటుంటేనే ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

రైల్వేలో 1Lakh+ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ : క్యాలెండరు

ఎంత శాలరీ ఉంటుంది:

సెలక్షన్ కాబడిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి టెంపరరీ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.

AP, తెలంగాణాలో మొత్తం ఎన్ని పోస్టులు:

IPPB నుండి విడుదలయిన 344 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ లో 8 పోస్టులు, తెలంగాణాలో 16 పోస్టులు ఉన్నాయి. ఇతర 28 రాష్ట్రాలలో కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఎలా అప్లికేషన్ చేసుకోవాలి:

పోస్టల్ IPPB ఉద్యోగాల ప్రకటనలోని అన్ని వివరాలు చూసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ద్వారా 31st అక్టోబర్ లోగా దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Apply Online

పోస్టల్ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!