AP Outsourcing Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి విజయనగరం జిల్లా నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చెయ్యడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సోషల్ వర్కర్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ ఉద్యోగాలకు 7th, 10th, 12th, డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చెయ్యండి.
పోస్టులు, అర్హతలు:
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్/కంప్యూటర్ ఆపరేటర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి 7th, 10th,12th, Any డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
శాలరీ వివరాలు:
ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹10,000/- నుండి ₹44,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతల్లో మంచి మార్కులు వచ్చినవారిని మెరిట్ విధానంలో ఎంపిక చేసి సొంత జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారు.
AP మంత్రుల పెషిల్లో భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: No Exam
దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:
అర్హతలు కలిగిన అభ్యర్థులు 20/09/2024 తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత విజయనగరం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ కి గడువులోగా దరఖాస్తులు పంపించాలి. ఆఖరి తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ తిరస్కరించడం జరుగుతుంది.
ఏ సర్టిఫికెట్స్ Submit చెయ్యాలి:
7th, 10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమో ఉండాలి
4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అనుభవం ఉన్నట్లయితే, ఆ సర్టిఫికెట్స్ సబ్మిట్ చెయ్యాలి.
తెలంగాణా కరెంట్ ఆఫీసుల్లో 2,260 ఉద్యోగాలు
ఎలా అప్లికేషన్ చేయాలి:
అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ee క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.