BIS Notification 2024:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి 345 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇతర పోస్టులతో ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ మధ్యన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకువాలి. BIS ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.
దరఖాస్తు చేసుకునే తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 9, 2024
దరఖాస్తు ఆఖరు తేదీ : సెప్టెంబర్ 30, 2024
పోస్టుల వారీగా ఖాళీలు, వయస్సు, అర్హతలు:
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య | అర్హతలు | వయస్సు |
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) | 01 | ఏదైనా డిగ్రీ / పీజీ | 18-35 |
అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్) | 01 | ఏదైనా డిగ్రీ / పీజీ | 18-35 |
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ) | 01 | ఏదైనా డిగ్రీ / పీజీ | 18-35 |
పర్సనల్ అసిస్టెంట్ | 27 | ఏదైనా డిగ్రీ | 18-30 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 43 | ఏదైనా డిగ్రీ | 18-30 |
అసిస్టెంట్ ( కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) | 01 | ఏదైనా డిగ్రీ | 18-30 |
స్టెనోగ్రాఫర్ | 19 | ఇంటర్ /డిగ్రీ | 18-27 |
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 128 | ఏదైనా డిగ్రీ | 18-27 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 78 | ఇంటర్ | 18-27 |
టెక్నికల్ అసిస్టెంట్ | 27 | ITI /డిప్లొమా | 18-30 |
సీనియర్ టెక్నీషియన్ | 18 | ITI /డిప్లొమా | 18-27 |
టెక్నీషియన్ | 01 | ITI | 18-27 |
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ వారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా లేదా OMR విధానంలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి అంశాలుm నుండి ప్రశ్నలు వస్తాయి. తగిన సమయంలోగా రాత పరీక్ష పూర్తి చేసుకోవాలి.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
UR, OBC, EWS అభ్యర్థులకు ₹100/- దరఖాస్తు రుసుము ఉంటుంది SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత జీతం ఉంటుంది:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావున 7th CPC ప్రకారం మొత్తం పోస్టులను అనుసరించి ₹35,000/- నుండి ₹55,000/- వరకు జీతం ఉంటుంది. అలాగే ఇతర అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన డాక్యుమెంట్స్:
• ssc మార్క్స్ లిస్ట్
• ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్స్
• కుల ధ్రువీకరణ పత్రం (SC, ST, OBC, EWS)
• సదరం సర్టిఫికెట్స్ (PWD అభ్యర్థులు)
• పాస్ పోర్ట్ సైజ్ ఫోటొగ్రాప్స్
• ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Online దరఖాస్తు ఫారం లింక్స్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండర్డ్స్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకువచ్చు. మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu వెబ్సైటు ని సందర్శించండి.