Anganwadi Jobs Recruitment 2024:
తెలంగాణాలో ఖాళీగా ఉన్న 11,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే ప్రీ స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ అప్ గ్రేడ్ చెయ్యడంవల్ల ఏర్పడే ఖాళీలను పూరించడానికి 11,000 వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నందున భారీ ఎత్తున ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఫీజు లేకుండా ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడతారు. చాలామంది ఉద్యోగ విరమణ చెయ్యడం, కొంతమంది పదోన్నతులు పొందడంవల్ల ఈ ఖాళీలు భారీగా ఏర్పడ్డాయి. ఈ ఉద్యోగాల ప్రకటన పూర్తి వివరాలు ఇప్పుడు చూడండి.
ఉద్యోగాల వివరాలు, అర్హతలు, వయస్సు:
ఈ అంగన్వాడీ ఉద్యోగాల నియామకాల్లో ప్రధానంగా అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు,అంగన్వాడీ హెల్పర్ పోస్టులను ఆయా జిల్లాలోని స్థానికంగా ఉన్న గ్రామీణ మహిళలకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అంగన్వాడీ టీచర్లతో పాటు సహాయకులుగా ఎంపిక అయ్యేవారికి కనీసం 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి, SC, ST అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నా అప్లై చేసుకోవచ్చు.
TGS RTC లో 10th అర్హతతో ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతి/ ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో అర్హత పొందిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత గ్రామంలోనే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
AP విద్యుత్ శాఖలో ఉద్యోగాలు : No Exam
అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్:
అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో మీ పూర్తి వివరాలు నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
ఇస్రోలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
జీతం వివరాలు:
అంగన్వాడీ టీచర్లుగా ఎంపిక కాబడిన వారికి నెలకు ₹12,000/- జీతం చెల్లిస్తారు. అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ హెల్పర్లకు నెలకు ₹8,000/- వరకు జీతం చెల్లిస్తారు.
పదవి విరమణ పొందితే కలిగే ప్రయోజనాలు:
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గతంలో 65 యేండ్లు దాటితే ఉద్యోగ విరమణ చేశారు. ఇందుకుగాను పదవి విరమణకు బదులుగా టీచర్లకు ₹2లక్షలు, సహాయకులకు ₹1లక్ష చొప్పున పరిహారంగా ఇచ్చేందుకు అంగన్వాడీ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ G.O ఇంతవరకు అమలు కాలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంకా విడుదలకాలేదు. త్వరలో 11,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడానికి తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేశాక ఆఫీసియల్ అంగన్వాడీ వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవాలి.
Notification Details : Update PDF
తెలంగాణా విద్య, ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ Freejobsintelugu ని సందర్శించండి.