తెలంగాణా స్టడీ సర్కిల్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2024:

తెలంగాణా రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ 2024 సంవత్సరానికి గాను కొత్తగా మంజూరు చేసిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్, రాజన్న సిరిసిల్ల బ్రాంచ్ నందు అవుట్ సోర్సింగ్ పద్దతిలో పని చేయడానికి సంబందించి ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్, కోర్స్ కోఆర్డినేటర్, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్స్ లేదా అటెండర్స్ పోస్టుల భర్తీకి సంబందించి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఆగష్టు 16వ తేదీ నుండి ఆగష్టు 25వ తేదీ వరకు అప్లికేషన్స్ సంబంధిత విభాగం వారికి సబ్మిట్à చెయ్యాలి. మీరు అప్లికేషన్స్ ని జిల్లా కల్పనా అధికారి రాజన్న సిరిసిల్ల కార్యాలయంలో అన్ని పని దినాలలో అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.

కరెంట్ సబ్ స్టేషన్స్ లో గవర్నమెంట్ జాబ్స్

AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

పోస్టులవారీగా అర్హతల వివరాలు:

ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ : 01 పోస్టు : బి.కాం లేదా ఎంబీఏ ఉత్త్తీర్ణత కలిగిన వారు అప్లై చేసుకోవాలి. ₹31,000/- నెలసరి వేతనం చెల్లిస్తారు.

కోర్స్ కోఆర్డినేటర్ : 01 పోస్టు : ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వారు అప్లై చేసుకోవాలి. ₹31,000/- నెలసరి వేతనం చెల్లిస్తారు.

ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ : 01 పోస్టు : ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి మరియు PGDCA సర్టిఫికెట్ కలిగి లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ & తెలుగు టైప్ రైటింగ్ కలిగినవారు అప్లై చేసుకోవాలి. ₹31,000/- నెలసరి వేతనం చెల్లిస్తారు.

ఆఫీస్ అసిస్టెంట్ / అటెండర్స్ : 03 పోస్టులు : 7వ తరగతి పాస్ అయ్యి కుకింగ్, డ్రైవింగ్, టైపింగ్ స్కిల్స్ కలిగినవారు అప్లై చేసుకోవాలి. నెలకు ₹22,200/- వేతనం చెల్లిస్తారు.

ఎలా అప్లై చెయ్యాలి:

పైన తెలిపిన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆగష్టు 16 నుండి ఆగష్టు 25వ తేదీలోగా రాజన్న సిరిసిల్ల జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో సంప్రదించి అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. ఈ నియామకాలన్ని సంబంధిత నియామక బోర్డు ద్వారా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్హతలు, అనుభవములను పరిగణలోకి తీసుకొని ఇంటర్వ్యూ నిర్వహించి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడును.

ఈ నియామకాల షెడ్యూల్ వాయిదా లేదా రద్దు పరిచే అధికారం జిల్లా కలెక్టర్ గారికి కలదు.

నోటిఫికేషన్ PDF : డౌన్లోడ్

మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతి రోజు సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!