Telangana Inter Results 2024:
తెలంగాణాలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం రాత పరీక్షలను తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు విజయవంతంగా ముగించింది. మొత్తం 1st ఇయర్, 2nd ఇయర్ కలిపి 9లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 1st ఇయర్ వాళ్ళు 4,78,527 మంది ఉన్నారు. అలాగే 4 లక్షల మందికి పైగా 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం మొత్తంగా 9,22,520 మంది పరీక్ష ఫీజు చెల్లించారు.
TS Inter Results Release Date:
రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 23న వెల్లడించే అవకాశం ఉన్నది. ఒకవేళ సాంకేతిక సమస్యలు ఎదురైతే 24న విడుదల చేయనున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలకానున్నందున ఈ నెల 23 లేదా 24న ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు సమాచారం. సాంకేతికపరమైన అంశా లను ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి వారంరోజులు పట్టే అవకాశం ఉందని చెప్పుతున్నారు. పరీక్ష రాసిన వారు, గైర్హాజరైన వారు, మాల్ ప్రాక్టీసింగ్కు పాల్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటరీకరించాల్సి ఉంటుంది. దీం తో పాటు వ్యాల్యూయేషన్లో వచ్చిన మార్కులను కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. తర్వాత మార్కుల జాబితా సక్రమంగా ఉందా? సాంకేతికపరమైన సమస్యలున్నా యా? అనే అంశాలను ఒకటికి రెండుసార్లు ఉన్నతాధికారులు పరిశీలిస్తారు.
సమా ధాన పత్రాలను మూల్యాంకనకు పంపే ముందు ఓఎంఆర్ షీటును తొలగిస్తారు. వాటికి కోడింగ్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు ఈ కోడ్స్ను డీ కోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చేపట్టిన రెండు రోజుల్లో పరీక్ష ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 21వతేదీ నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. ఉగాది పండుగ తర్వాత ఉన్నతాధికారులు సమావేశమై ఫలితాల వెల్లడిపై తేదీని ఖరారు చేస్తారని సమా చారం. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులే ఫలితాలు వెల్లడిస్తారు. దీనికి ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.
How To Check TS Inter Results 2024:
విద్యార్థులు వారి TS ఇంటర్ ఫలితాలు 2024 మొదటి సంవత్సరం మరియు TS ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు 2024 కు సంబందించిన ఫలితాల ప్రకటన తర్వాత Check చేయడానికి క్రింది వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు:
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.