AP High Court notification 2026:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి లో పని చేయడానికి మొత్తం 332 పోస్టులతో ఏపీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ వారు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఏడవ తరగతి పదవ తరగతి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాము
హైకోర్టు ఉద్యోగాల సమగ్ర సమాచారం:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది విధంగా ఉంది.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు |
| మొత్తం పోస్టులు | 332 |
| పోస్టుల పేర్లు | కోర్టు మాస్టర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, అసిస్టెంట్ఎ,గ్జామినర్, ఆఫీస్ సభార్డినేట్, టైపిస్ట్, కాపీయిస్ట్ |
| అర్హతలు | 7th, 10th, డిగ్రీ |
| లాస్ట్ డేట్ | 19th ఏప్రిల్, 2026 |
| ఎంపిక విధానం | రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలైన 332 ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏడవ తరగతి లేదా పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని పోస్టులకు షార్ట్ హ్యాండ్ మరియు టైపు రైటింగ్ హయ్యర్ గ్రేట్ సర్టిఫికెట్స్ కూడా ఉండాలి.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్లో హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఓ సి, ఓ బి సి, ews అభ్యర్థులు ₹800/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ వికలాంగులు ₹400/- ఫీజు చెల్లించాలి.
ఎంత శాలరీ ఉంటుంది:
పోస్టులను అనుసరించి 40 వేల రూపాయల నుండి 80 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది
- ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు
- స్కిల్ టెస్ట్ పెడతారు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు & లింక్స్:
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 30th March, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ | 19th April, 2026 |
| నోటిఫికేషన్ | Download |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.