AP junior assistant jobs notification 2026:
వివిధ శాఖలలో బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి కృష్ణాజిల్లా కు చెందిన అర్హులైన నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన 38 బ్యాక్ లాగ్ పోస్టులకై దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తు చివరి తేది 30-03-2026 సాయంత్రం 5:00 గం.ల లోపు. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి వయస్సు 18 సంవత్సరముల పైబడి తేది: 01-07-2026 నాటికి 52 (42 +10) సంవత్సరములు ధాటి ఉండరాదు. ఈ క్రింది ప్రకటించిన ఖాళీలు అన్నియు పూర్తిగా ఉమ్మడి కృష్ణాజిల్లా స్థానికత కలిగిన వారికి మాత్రమే ఇవ్వబడును.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలైన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం ఈ క్రింది విధంగా ఉంది.
- సంస్థ పేరు: జిల్లా కలెక్ట ర్ వారి కార్యాలయము, కృష్ణాజిల్లాఉమ్మడి కృష్ణాజిల్లా లోని వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన వివిధఉద్యోగాల నియామకపు ప్రకటన 2025-26
- మొత్తం పోస్టులు: 38 బ్యాక్ లాగ్ పోస్టులు
- పోస్టుల పేర్లు :జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, టైపిస్ట్, వెటర్నరీ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, సానిటరీ మేస్త్రి, మెసెంజర్, సప్లయర్, ఇతర పోస్టులు
- అర్హతలు:
- వయసు : ఏడవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత
- లాస్ట్ డేట్: మార్చి 30, 2026
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలైన బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏడవ తరగతి అర్హత లేదా ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న వారికి మరొక పది సంవత్సరాలు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలైన అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత శాలరీ ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి ₹35,000/- రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి యొక్క వయస్సు 18 సంవత్సరములు పైబడి తేది: 01.07.2026 నాటికి 52 (42+10)సంవత్సరములు దాటి ఉండరాదు.
- దృష్టిలోపం (అందులు), శారీరక (చలన), మరియు ఆటిజం, మేదో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసికఅనారోగ్యం మరియు బహుళ వైకల్యాలు గల వారైతే వైకల్య శాతం కనీసం 40 శాతం ఉండవలెను. బధిరుల విషయంలో దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం రెండు చెవులలో స్పీచ్ ఫ్రీక్వెన్సీ లో 70 db వినికిడి లోపం ఉన్న వ్యక్తులు మరియు వినికిడి కస్టమ్ అనగా రెండు చెవులలో స్పీచ్ ప్రీక్వెన్సీ 60 db నుండి 70 db వినికిడిలోపం ఉన్న వ్యక్తులు,
- దరఖాస్తుతో పాటు 1) పుట్టిన తేది ధృవపత్రము, 2) రీవెరిఫికేషన్ సదరం సర్టిఫికేట్ అది లేని యెడల ప్రస్తుతం ఉన్నసదరం వైద్య ధృవీకరణ పత్రము, 3) విద్యార్హతల ధృవీకరణ పత్రములు, 4) ఎంప్లాయిమెంట్ కార్డ్, 5) 1వ తరగతి నుండి10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, 6) కుల ధృవీకరణ పత్రం, 7) స్థిర నివాస దృవీకరణ పత్రము, 8) రేషన్ కార్డ్, 9)ఆధార్ కార్డ్ స్వీయ దృవీకరణతో జతి పరచవలెను. పాస్ పోర్ట్ సైజు ఫోటో దరఖాస్తుకు అతికించవలెను. దృవపత్రములు జత చేయబడని ధరఖాస్తులు తిరస్కరించబడును.
- ఎంపిక విధానం: అ) గ్రూపు 4 (డి.యస్.సి) నందు చూపిన పోస్టులకు సంబంధిత విద్యార్హత లో సాధించిన మార్కులమెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడును మరియు క్రమ సంఖ్య, (1) నుండి (3) వరకు పోస్టులకు జిల్లా కలెక్టర్ వారిచే నిర్వహించు Proficiency in office automation with usage of Computers and Associates software test ఉత్తీర్ణత సాదించవలెను. అభ్యర్ధులకు మెరిట్ సమానంగా వచ్చినదో ఆదిక అంగవైకల్యము గల అభ్యర్ధులకు ఎంపికలోప్రాధాన్యత కల్పించబడును.
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు, ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా దరఖాస్తులు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు మరియు లింక్స్:
| నోటిఫికేషన్ & అప్లికేషన్ | Download |
| దరఖాస్తు ఆఖరి తేదీ | మార్చి 30, 2026 |
ఆంధ్రప్రదేశ్ బ్యాక్లాగ్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.