AP Anganwadi Jobs Notification 2026:
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు ఎన్టీఆర్ జిల్లాలలో ఖాళీగా ఉన్నారు 215 అంగన్వాడి ఆయా మరియు అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడవ తరగతి లేదా పదవ తరగతి అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి. అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి రాక పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహించి సర్టిఫికెట్ల పరిశీలన చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు :
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ డిపార్ట్మెంట్ |
| మొత్తం పోస్టులు | 215 |
| పోస్టుల పేర్లు | అంగన్వాడి ఆయా, మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడి హెల్పర్ |
| అర్హతలు | 7th, 10th అర్హత |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 3, 2026 |
| ఎంపిక విధానం | రాత పరీక్ష ఆధారంగా ఎంపిక |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా మరియు కర్నూలు జిల్లా నుండి అంగన్వాడీలో పనిచేయడానికి విడుదలైన 215 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏడవ తరగతి అర్హత లేదా పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. అనుభవం అవసరం లేదు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన స్థానిక మహిళ అభ్యర్థులు అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు?:
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ ఎంత :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 6000 నుండి 12,000 రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్:
ఏపీ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు పంపించాలి.
- రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఉండదు
- ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ 215 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 3 2026 తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించవలెను.
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన వారు క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకొని, గడువులోగా అప్లికేషన్స్ పంపించవలెను.
అంగన్వాడీ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.