NRC Group C Jobs Notification :
మహారాష్ట్ర నాసిక్ లో ఉన్నటువంటి టిఫిన్స్ సంస్థ నుండి 06 గ్రూప్ సి సివిలియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఫైర్ మాన్, సైస్, సాడ్లేర్ ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ఆఫ్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:
NRC డిఫెన్స్ సంస్థ నుండి విడుదలైన గ్రూప్స్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | NRC డిఫెన్స్ సంస్థ నాసిక్, మహారాష్ట్ర |
| పోస్టుల పేర్లు | ఫైర్ మ్యాన్, సైస్, సాడ్లేర్ |
| మొత్తం పోస్టులు | 06 |
| అర్హతలు | పదో తరగతి, ఇంటర్మీడియట్ |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 25, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
నాసిక్ మహారాష్ట్రలో ఉన్న డిఫెన్స్ సంస్థ నుండి గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవాలి. అన్ని రాష్ట్రాల వారు అర్హులే.
ఎంత వయస్సు ఉండాలి?:
పదో తరగతి అర్హత పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఫైర్ మాన్ ఉద్యోగాలకు అనగా ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. అయితే అప్లికేషన్స్ పంపించేటప్పుడు ₹5/- పోస్టల్ స్టాంప్ చార్జీలను అభ్యర్థులు భరించాల్సి ఉంటుంది.
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 45 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
ఫైర్ మాన్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించాలి
- OMR ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు
- ఫైర్ మాన్ పోస్టులకు ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి.
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ లో విడుదలైన తేదీ నుండి 28 రోజులలోగా సంబంధిత అడ్రస్ కి అప్లికేషన్స్ ని పంపించాలి. అంటే జనవరి 17వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీలోగా అప్లికేషన్స్ పంపించవలసి ఉంటుంది.
- అప్లికేషన్స్ పంపించవలసిన అడ్రస్ : The Commandant, Headquarters, School of Artillery, Devlali, DistrictNasik, Maharashtra PIN-422401″
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేయండి.
Notification & Application Form
ఫైర్ మాన్ లాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని www.freejobsintelugu.com ప్రతిరోజు సందర్శించండి.