CSIR CLRI Jobs Notification 2026:
CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 13 పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్స్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి అర్హత లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లమా అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకోండి
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:
CSIR సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) |
| పోస్టుల పేర్లు | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్స్ స్టెనోగ్రాఫర్ |
| మొత్తం పోస్టులు | 13 |
| అర్హతలు | పదో తరగతి, 10+2 Pass |
| అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 17th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
CSIR సెంట్రల్ లెదర్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి అర్హత లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
పోస్టులను అనుసరించి 18 నుండి 25 సంవత్సరాలు లేదా 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అభ్యర్థులు ₹500/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹35 వేల రూపాయల నుండి ₹65 వేల రూపాయల వరకు శాలరీస్ ఉంటాయి. ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ తో పాటు అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- అభ్యర్థులకు ఆఫ్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు
- స్పీడ్ టెస్ట్ ఉంటుంది
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
ముఖ్యమైన తేదీలు:
CSIR సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 17 2026 నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 22, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని వివరాలు చూసిన తర్వాత పూర్తి అర్హతలు కలిగిన వారు ఇక్కడి నుండి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చేయండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి