SBI SCO Notification 2026:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 1146 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి, ఆరు సంవత్సరాలు సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తూ, ఇటువంటి రాత పరీక్ష లేకుండా అన్ని అర్హతలు ఉన్నవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. 20 నుండి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:
SBI SCO ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
| పోస్టుల పేరు | స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) |
| మొత్తం పోస్టులు | 1146 |
| అర్హతలు | ఏదైనా డిగ్రీ మరియు ఎంబీఏ అర్హత |
| లాస్ట్ డేట్ | జనవరి 10, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాలు అర్హతలు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఎంబీఏ చేసిన అర్హత కూడా కలిగి ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే పోస్టులను అనుసరించి కనిష్టంగా ఆరు సంవత్సరాలు సంబంధిత విభాగంలో అనుభవం కూడా కలిగి ఉండాలి.
ఎంత వయస్సు ఉండాలి?:
20 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఎస్బిఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు సడలింపు కూడా కల్పిస్తారు.
ఎంత ఫీజు ఉంటుంది?:
ఎస్బిఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఈ క్రింది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- UR, EWS, OBC అభ్యర్థులకు: ₹750/- ఫీజు ఉంటుంది.
- మిగిలిన ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా ఎంపిక చేస్తారు?:
ఎస్బిఐ SCO ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా అప్లై చేసుకున్న వారికి ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేశాక, అన్ని అర్హతలు మరియు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ
- వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- మెడికల్ టెస్ట్ ఉంటుంది.
ఎంత శాలరీ ఉంటుంది:
ఎస్బిఐ నుండి విడుదలైన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగానే జీతాలు ఉంటాయి. పోస్టులను అనుసరించి నెలకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు జీతాలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
SBI SCO ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 2nd డిసెంబర్, 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ | 10th జనవరి, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ అలాగే అప్లై లింక్స్ ద్వారా గడువులోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.
బ్యాంకు జాబ్స్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.