Postal Jobs Recruitment 2025:
ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గుజరాత్ పోస్టల్ సర్కిల్ లో పనిచేయడానికి పదో తరగతి అర్హతతో 50 స్టాప్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి అర్హత కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నుండి మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. థియరీ టెస్ట్ అలాగే ప్రాక్టికల్ టెస్ట్ కూడా నిర్వహించి అర్హత పొందిన అభ్యర్థులకు స్టాఫ్ కార్ డ్రైవర్ గా పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ యొక్క పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల ముఖ్యమైన సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ |
| పోస్ట్ పేరు | స్టాఫ్ కార్ డ్రైవర్ |
| అర్హతలు | పదవ తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ |
| మొత్తం పోస్టులు | 50 |
| లాస్ట్ డేట్ | జనవరి 19, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10వ తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మూడు సంవత్సరాలు డ్రైవింగ్లో అనుభవం కలిగి ఉన్నట్లయితే వారికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు, పోస్టల్ డిపార్ట్మెంట్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితులు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
పోస్టల్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ₹100/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఎంత శాలరీ ఉంటుంది?:
పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35 వేల రూపాయలు శాలరీలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
పోస్టల్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది
- ముందుగా ఆఫ్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి
- అప్లై చేసుకున్న వారికి ముందుగా థియరీ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత పొందిన వారికి ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
- అర్హత పొందిన వారికి పోస్టింగ్ ఇస్తారు
అప్లికేషన్ ఆఖరు తేదీ:
పోస్టల్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు జనవరి 19, 2026 తేదీ వరకు సమయం కల్పించారు. అర్హతలు ఉన్నట్లయితే వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్ అన్ని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.
పోస్టల్ ఉద్యోగాలు సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను విజిట్ చేయండి