AP KGBV Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1,095 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా జిల్లాల వారి ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు. టెన్త్ , ఇంటర్మీడియట్ , డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. APCOS గైడ్ లైన్స్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం :
AP KGBV నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు |
| పోస్టుల పేరు | వార్డెన్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అకౌంటెంట్, అటెండర్, ANM, హెడ్ కుక్, స్వీపర్, ఇతర పోస్టులు. |
| మొత్తం పోస్టులు | 1,095 నాన్ టీచింగ్ జాబ్స్ |
| అర్హతలు | 10th, ఇంటర్, డిగ్రీ |
| ఆఖరు తేదీ | 11th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైటు | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ కేజీబీవీలలో పనిచేయడానికి ఔట్సోర్సింగ్ విధానంలో విడుదలైన 1,095 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ , ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు.
ఎంత వయస్సు ఉండాలి?:
కేజీబీవీ నోటి ఇచ్చి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే వారికి 50 సంవత్సరాల వరకు వయసున్నా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు?:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరి అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తులు పూర్తి చేసి సబ్మిట్ చేసుకోవాలి.
ఎంపిక విధానం?:
ఏపీ కేజీబీవీ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.
- రాత పరీక్ష లేకుండా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
ఏపీ కేజీబీవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, ₹10,000/- నుండి ₹40,000/- వరకు జీతాలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
కేజీబీవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలో అప్లికేషన్ పెట్టుకోవాలి.
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 3rd జనవరి, 2026 |
| అప్లికేషన్ ఆఖరి తేదీ | 11th జనవరి, 2026 |
| ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు | 23rd, 24th జనవరి, 2026 |
| ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ | 28th జనవరి, 2026 |
| డ్యూటీలో రిపోర్టింగ్ ఇచ్చే తేదీ | 1st ఫిబ్రవరి, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
ఏపీ కేజీబీవీ ఉద్యోగాల సమాచారం చేసిన తర్వాత అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి.