Postal GDS Notification 2025:
పోస్ట్ ఆఫీసుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి జనవరి 15, 2026వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పదో తరగతి అర్హత కలిగిన వారు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా కంప్యూటర్ ఆధారిత సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 40 వేల పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:
పోస్ట్ ఆఫీసుల్లో పని చేయడానికి పోస్టల్ GDS ఉద్యోగాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమైన వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఇండియా పోస్టల్ రిక్రూట్మెంట్ |
| భర్తీ చేసే పోస్టుల పేర్లు | పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ |
| అంచనా పోస్టులు | 40,000+ (Approximately) |
| అర్హత | 10th అర్హత |
| నోటిఫికేషన్ విడుదల తేదీ | జనవరి 15, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
పోస్టుల విద్యార్హతలు:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు పదో తరగతి పాస్ అయిన అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా దేశవ్యాప్తంగా 40,000 ఉద్యోగాలను బర్తీ చేయనున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆన్లైన్లో అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా, ఎటువంటి రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ జనరేటర్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- వారం రోజులు ట్రైనింగ్ ఇస్తారు.
- ట్రైనింగ్ పూర్తయిన తర్వాత, అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
పోస్టల్ GDS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC, ST, ఉమెన్, pwd అభ్యర్థులకు ఫీజు లేదు.
- UR, EWS, OBC అభ్యర్థులకు : ₹100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఎంత శాలరీ ఉంటుంది?:
పోస్టల్ GDS ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి క్రింది విధంగా శాలరీస్ ఉంటాయి.
- BPM ఉద్యోగాలకు : ₹18,500/-
- ABPM/ డాక్ సేవక్ ఉద్యోగాలకు : ₹14,500/-
- ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి
ముఖ్యమైన తేదీలు:
పోస్టల్ GDS నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలు ఈ క్రింది టేబుల్ ద్వారా చూడండి.
| నోటిఫికేషన్ విడుదల తేదీ | 15th జనవరి, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ | 15th జనవరి, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
పోస్టల్ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా గడువులోగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
పోస్టల్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.