AAI Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI) నుండి 14 జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడగలరు.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా |
| పోస్ట్ పేరు | జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ |
| అర్హతలు | డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత |
| వయస్సు | 18 నుండి 30 సంవత్సరాలు |
| ఆఖరి తేదీ | 11th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి?:
అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే వారికి 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితులో సడలింపు ఉంటుంది.
ఎంత శాలరీ ఉంటుంది?:
AAI జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 50 వేల నుండి 60 వేల రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అయినందున, ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు ఎంత?:
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ క్రింది దరఖాస్తు ఫీజులు అభ్యర్థులు చెల్లించవలెను.
- జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబిసి అభ్యర్థులకు: ₹1000/-
- ఇతర అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్?:
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
- మెడికల్ పరీక్షలు నిర్వహించి,
- అన్ని అర్హతలు కలిగిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు?:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 12th డిసెంబర్, 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 11th జనవరి, 2026
- రాత పరీక్ష ఎప్పుడు : పరీక్ష తేదీల వివరాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి
ముఖ్యమైన లింక్స్:
ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల వివరాల కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి.