AP Digital Lakshmi Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక బృందాల్లో ఉన్నటువంటి మహిళల కోసం ” డిజిటల్ లక్ష్మి పథకాన్ని” ప్రారంభించింది. పట్టణాల్లో ఉన్న SHG’s ( Self Help Group) సభ్యులుగా ఉన్నటువంటి వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలకు ₹2,00,000/- తక్కువ వడ్డీకి లోన్ రూపంలో సహాయం అందిస్తారు. ఈ పథకం ద్వారా మహిళలు డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక స్వావలంబన తో కూడిన ఉపాధిని పొందేలా చేయడమే ముఖ్యమైన లక్ష్యం. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ఎలా అప్లై చేయాలి, ఎంత ఆర్థిక సహాయం మహిళలు పొందుతారు అనేటువంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
డిజిటల్ లక్ష్మి పధకం ముఖ్య అర్హతలు :
| అంశము | వివరాలు |
| సభ్యత్వం | పట్టణ ప్రాంతాల్లో SHG ( స్వయం సహాయక గ్రూపులో) సభ్యురాలై ఉండాలి |
| అనుభవం | కనీసం మూడు సంవత్సరాలుగా స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండాలి |
| వయస్సు | 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి |
| విద్యార్హత | కనీసం డిగ్రీ పాసై ఉండాలి |
| డిజిటల్ ట్రైనింగ్ | కచ్చితంగా ప్రాథమిక కంప్యూటర్ ట్రైనింగ్ వచ్చి ఉండాలి( బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం ) |
| నివాస స్థలం | SLF పరిధిలో SHG సభ్యురాలై ఉండాలి |
| ఉపాధి స్టేటస్ | ఇంటి నుండి పనిచేయగలగాలి, ఉపాధి కలిగి ఉండాలి. |
డిజిటల్ లక్ష్మీ పథకం ప్రధాన లక్ష్యాలు:
ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా విడుదల చేశారు ఈరోజు : మీ పేరు చూసుకోండి
| అంశము | వివరాలు |
| పథకం ప్రారంభ తేదీ | జూన్ 8, 2025న ప్రత్యక్షంగా ప్రారంభించబడింది |
| లక్ష్యం | పట్టణ మహిళలకు ఉపాధి కల్పన ద్వారా ఆర్ధిక స్వావలంబన పొందడం |
| నమోదు ప్రక్రియ | మీసేవ లేదా CSC సెంటర్ ద్వారానమోదు చేయాలి. |
| ఎంపిక విధానం | ప్రతి SLF ( Slum Level Federation) నుండి ఒక మాస్టర్ ఎంపిక. |
| డిజిటల్ గ్యాడ్జెట్ | ప్రతి 25 SHG’s కి ఒక Digi Lakshmi ని ఎంపిక చేస్తారు (మొత్తం 250 మంది) |
| అవసరమైన సామాగ్రి | కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ ,ఇంటర్నెట్ అవసరం |
| వేతనం. | ప్రతి మహిళకు ₹2,000/- నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది. |
ఎలా అప్లై చేయాలి?:
AP ఎంసెట్ 2025 లో ఎంత ర్యాంకు వస్తే KL యూనివర్సిటీలో సీటు వస్తుంది
- మీసేవ లేదా CSC సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
- అవసరమైన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డ్
- SHG మెంబర్షిప్ డాక్యుమెంట్
- విద్యార్హతల సర్టిఫికెట్
- బ్యాంక్ అకౌంట్ వివరాలు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
డిజిటల్ లక్ష్మీ పథకం ముఖ్య ప్రయోజనాలు :
- ఈ పథకానికి ఎంపికైన మహిళల చేత డిజిటల్ కియోస్క్ సెంటర్స్ ని లేదా మీసేవ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తారు.
- ఇది పట్టణాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ప్రారంభించిన పథకం.
- ఈ పథకం ద్వారా వారు ఇంటి నుండి ఉపాధి అవకాశాలు పొందవచ్చు
- ఏర్పాటుచేసిన కియోస్క్ సెంటర్ లేదా మీ సేవ కేంద్రం ద్వారా, చుట్టుపక్కల ప్రజలకు డిజిటల్ సేవలు అందిస్తూ ఆదాయం పొందవచ్చు.
- మహిళ ఆర్థిక సభలీకరణ అవుతుంది.
- స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
Note:
- ఇది రాష్ట్రస్థాయిలో మొదటిసారి మహిళల కోసం ప్రత్యేకంగాడిజిటల్ ఉపాధి కోసం రూపొందించిన పథకం.
- ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో అమలవుతుంది
- అర్హుల ఎంపిక పూర్తిగా SLF ఆధారంగా జరుగుతుంది.
ముఖ్యమైన వెబ్సైటు లింక్స్ : https://ap.meeseva.gov.in
ఈ పథకం ద్వారా మహిళలు డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు నడిపించే అవకాశాన్ని పొందుతున్నారు. పట్టణాల్లో ఉన్న మహిళలకు ఇది ఒక గేమ్ చేంజ్ అవకాశంగా మారబోతోంది.