AP, TS engineering 1st year classes starting date:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో జాయిన్ కాబోయే విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE – All India Council for Technical Education) 2025-26 క్యాలెండర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు భారతదేశంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలో మరియు యూనివర్సిటీలు వారి యొక్క మొదటి ఇంజనీరింగ్ సంవత్సర క్లాసెస్ ని ఆగస్టు 14వ తేదీలోపు తరగతులు ప్రారంభించాలని క్యాలెండర్ లో స్పష్టం చేసింది. కొత్తగా గుర్తింపు పొందినటువంటి కళాశాలలు మరియు యూనివర్సిటీలు కూడా అదే తేదీలోగా క్లాసెస్ ని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏఐసిటిఈ అధికారికంగా విడుదల చేసిన క్యాలెండర్ 2025-26 కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
AICTE ముఖ్యమైన అంశాలు:
- AICTE ( All India Council for Technical Education ) 2025-26 షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (BE/BTECH) తరగతులను ఆగస్టు 14వ తేదీలోగా కచ్చితంగా ప్రారంభించాలి.
- ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలలు మరియు యూనివర్సిటీలకు కూడా వర్తిస్తుంది.
- అన్ని కాలేజీలు అడ్మిషన్స్ ప్రాసెస్ పూర్తి చేసుకుని, క్లాస్ కమీన్స్మెంట్ తేదీలను ఈ షెడ్యూల్ ప్రకారమే ప్రారంభించాలి.
- ఆలస్యం జరిగితే సంబంధిత కాలేజీలు మరియు యూనివర్సిటీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
AICTE విడుదల చేసిన షెడ్యూల్ ఇదే:
| అంశము | వివరాలు |
| క్యాలెండర్ విడుదల తేదీ | 17th మే, 2025 |
| ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ప్రారంభ గడువు | 14th ఆగష్టు, 2025 |
| ఆన్లైన్ ప్రవేశాల చివరి తేదీ | 30th జూలై, 2025 |
• ఈ షెడ్యూల్ AICTE అధికారికి వెబ్సైట్లో ఉంది.
ఏపీలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు సంవత్సరానికి ₹6000/- డిపాజిట్: అప్లై చేయండి
రాష్ట్రాల వారీగా పరిస్థితి ఎలా ఉంది?:
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో:
ఆంధ్రప్రదేశ్లోని జెఎన్టియు కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అనుబంధిత కాలేజీలు ఏఐసీటిఈ షెడ్యూల్ ప్రకారం, ఆ షెడ్యూల్ ని అనుసరిస్తూ ఆగస్టు 1వ తేదీ నుండి 14వ తేదీ మధ్యన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసెస్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి.
• తెలంగాణ రాష్ట్రంలో:
ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్టియు హైదరాబాద్ , ఇతర యూనివర్సిటీలో అనుబంధ కాలేజీలు కూడా ఆగస్టు మొదటి వారం నుండే తరగతులు ప్రారంభమయ్యేలాగా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని కాలేజీలు ఆగస్టు 5 నుండి 8వ తేదీ మధ్యన మొదటి సంవత్సరం క్లాసెస్ ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి.
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు :
- మీరు అడ్మిషన్స్ పొందిన కాలేజీ నుండి క్లాసెస్ ప్రారంభ తేదీ కన్ఫర్మేషన్ తెలుసుకోండి.
- AICTE షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 14వ తేదీకి ముందు తరగతులు ప్రారంభమవుతాయి.
- Academic ప్రిపరేషన్ ఇప్పటికే మొదలు పెట్టండి. ప్రాథమిక సబ్జెక్టులపై అవగాహన తెచ్చుకోండి లేదంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ యొక్క జీవితంలో.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలో తప్పనిసరిగా ఆగస్టు 14వ తేదీ లోపు మొదటి సంవత్సర క్లాసెస్ ని ప్రారంభించాలి. ఇది AICTE ఇచ్చిన గడువు.