TS Inter Short Memos 2025 Download:
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) వారు ఇటీవల పూర్తి చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు వారి యొక్క షార్ట్ మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి అధికారిక వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటి మరియు రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న ఇంటర్మీడియట్ అభ్యర్థులు వారి యొక్క షార్ట్ మెమోలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ షార్ట్ మెమోలు మీకు డిగ్రీ అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ కోసం ఎంతగానో ఉపయోగపడతాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు నుండి లాంగ్ మెమోలు మీకు వచ్చేంతవరకు ఈ షార్ట్ మెమోరీ మీకు చాలా అవసరం కాబట్టి పూర్తి వివరాలు చూసి షార్ట్ మెమోస్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోగలరు.
షార్ట్ మెమోలు ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి:
• ఈ షార్ట్ మిమ్ములు ఇటీవల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
• ఈ షార్ట్ మెమోలు అవసరపడే చోట్లు :
- ఇంజనీరింగ్ / డిగ్రీ అడ్మిషన్లు
- TS ఎంసెట్ లేదా ఐసెట్ కౌన్సిలింగ్
- స్కాలర్షిప్స్ దరఖాస్తుల సమయంలో.
- ఇతర హయ్యర్ ఎడ్యుకేషన్ అవసరాల కోసం ఉపయోగపడతాయి
- షార్ట్ మెమోలు డౌన్లోడ్ చేసుకునే లింక్ ఆక్టివేట్ అయిన తేదీ: జూన్ 27 2025
- అధికారిక వెబ్సైట్ : https://tgbie.cgg.gov.in/
షార్ట్ మెమో అంటే ఏంటి?:
షార్ట్ మెమో అనగా ఇంటర్మీడియట్ విద్యార్థుల మార్కులను తెలిపే తాత్కాలిక మేమో . ఇది డిజిటల్ గా జనరేట్ చేయబడుతుంది మరియు ఒరిజినల్ లాంగ్ మెమో వచ్చేంతవరకు ఇది మీకు ఉపయోగపడుతుంది.
ఏపీ ఎంసెట్ 2025 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన వారికి 2nd Phase ఫలితాలు విడుదల
షార్ట్ మెమో ఎలా డౌన్లోడ్ చేయాలి?:
- ముందుగా అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి: https://tgbie.cgg.gov.in/
- “IPE March 2025 short memos” లింకుపై క్లిక్ చేయండి
- ఈ సంవత్సరం ఎంచుకోండి ( 1st year or 2nd year )
- హాల్ టికెట్ నెంబర్ మరియు జన్మదిన తేదీ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే మీ షార్ట్ మార్క్స్ మెమో స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతుంది.
- దానిని పిడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు : Apply Now
ముఖ్యమైన విషయాలు:
- ఈ లింక్ ద్వారా 2025 మార్చ్ పరీక్ష రాసిన రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే లభిస్తాయి.
- ఒకేషనల్ విద్యార్థులు కూడా ఈ లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- మీ షార్ట్ మెమోలో ఏదైనా లోపాలు గమనించినట్లయితే మీ కళాశాల ప్రిన్సిపల్ గాని లేదా ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించండి.
TS BIE Short Memo Download Link
FAQ’s:
1. ఎంసెట్ కౌన్సిలింగ్ కి ఈ షార్ట్ మెమో సరిపోతుందా?
అవును, ఇది తాత్కాలికంగా ఉపయోగపడుతుంది.
2.2020 లేదా 2023లో పాస్ అయిన వారికి ఈ లింకు ఉపయోగపడుతుందా?
లేదు, లింకు కేవలం 2025 IPE పరీక్షలు రాసిన వారికి మాత్రమే