మరో నాలుగు రోజులపాటు ఈ జిల్లాల్లో వర్షాలు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మరో 4 రోజుల పాటు వర్ష బీభత్సం సృష్టించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 4వ తేదీ నుండి ఏడో తేదీ వరకు ఈ నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, విద్యార్థులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
వాతావరణ శాఖ ముఖ్యంశాలు:
- బంగాళాఖాతంలో అల్పపీడనం : ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- వర్షాలు కురిసే పలు జిల్లాల వివరాలు : తెలంగాణలో హైదరాబాద్ సహా ఇప్పటికే ఏడు జిల్లాల్లో వర్షాలు మొదలైయ్యాయి.
- ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారి: ఎల్బీనగర్, నిజామాబాద్, మెదక్ , ఖమ్మం , మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు .
- ఈదురు గాలులు వేగం : ఈ జిల్లాల్లో ఈదురుగాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
- రైతులకు హెచ్చరికలు : వాతావరణ శాఖ పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని రైతులకు హెచ్చరిక జారీ చేసింది.
- ప్రయాణికులకు సూచనలు: దూర ప్రయాణాలు చేసే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ జాములు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
- Join Whats App Group
జిల్లాల వారీగా వర్ష ప్రభావం :
తెలంగాణ ప్రాంతం:
- హైదరాబాద్ మెదక్ , ఖమ్మం , మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
- పలు ప్రాంతాల్లో ఉన్న పొలాలు కూడా నీట మునిగే అవకాశం ఉంది.
- జియో 895 రూపాయలకే 336 రోజులు వ్యాలిడిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రాంతం :
- ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- ఉత్తర కోస్తా ఆంధ్రాలో వర్ష ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ శాఖ పలు సూచనలు:
- రైతులు పంటలను తడవకుండా చూసుకోవాలని, దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
- ప్రజల అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరించింది.
- లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
అధికారిక సమాచారం:
ఈ అధికారిక సమాచారం హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి వాతావరణ శాఖ వారు తెలిపారు. ఇది తాజా నివేదిక కాబట్టి, ఈ నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అప్డేట్ లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.