ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP WDCW Dept. Notification 2024 | Freejobsintelugu

AP Welfare Dept. Notification 2024:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్టు పద్ధతిలో పని చెయ్యడానికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్అసిస్టెంట్, కంప్యూటర్ నౌలెడ్జి, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుండి నోటిఫికేషన్స్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎంపిక అయిన మహిళా అభ్యర్థులు వన్ స్టాప్ సెంటర్స్ లో కాంట్రాక్టు పద్ధతిలో పని చెయ్యాలి. రెండూ జిల్లాలకు సంబందించిన స్థానిక మహిళలు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పోస్టులవారీగా అర్హతలు:

ఆఫీస్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్స్ /IT లో డిప్లొమా చేసి డేటా మానేజ్మెంట్, ప్రాసెస్ డాకుమెంటేషన్ లో 3 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు అర్హులు.

Join Our Telegram Group

మల్టీపర్పస్ స్టాఫ్ / కుక్ : 10వ తరగతి పాస్ అయ్యి ఆ విభాగంలో కొంత అనుభవం కలిగిన వారికి జాబ్స్ ఇస్తారు.

సెక్యూరిటీ గార్డ్ /నైట్ గార్డ్ : సెక్యూరిటీ పర్సనల్ గా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఆర్గనైజషన్ లో పని చేసిన అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ : మాస్టర్స్ ఇన్ లా / సోషల్ వర్క్ / సోసియాలజీ / సోషల్ సైన్స్ /సైకోలజీ లో అర్హత కలిగి 5 సంవత్సరాల అనుభవం కలిగినవారు అప్లై చేసుకోవాలి.

తెలంగాణాలో 1629 రేషన్ డీలర్లు నోటిఫికేషన్

కేస్ వర్కర్ : బాచిలర్ ఇన్ లా / సోషల్ వర్క్ / సోసియాలజీ / సోషల్ సైన్స్ /సైకోలజీ లో అర్హత కలిగి 3 సంవత్సరాల అనుభవం కలిగినవారు అప్లై చేసుకోవాలి.

పారా లీగల్ పర్సనల్ : 3 సంవత్సరాల అనుభవం కలిగి లా డిగ్రీ చేసినవారు అప్లై చేసుకోవచ్చు.

సైకో సోషల్ కౌన్సిలర్ : మహిళలు అభ్యర్థి ఎవ్వరైన డిగ్రీ / డిప్లొమాలో సైకోలజీ /psychiatry / న్యూరో సైన్సెస్ చేసి 3 సంవత్సరాల అనుభవం కలిగినవారు అప్లై చేసుకోవాలి.

AP సంక్షేమ శాఖలో 997 ఉద్యోగాలు

ఎంత వయస్సు ఉండాలి:

01.07.2024 నాటికీ 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లై చేసుకోవాలి.

జీతం, ఫీజు వివరాలు:

పోస్టులను అనుసరించి ₹13,000 నుండి ₹34,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు. ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి ఎటువంటి ఫీజు లేదు.

పోస్టల్ శాఖలో కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లికేషన్ పెట్టుకున్నవారిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు

కావాల్సిన డాక్యుమెంట్స్:

పోస్టులను భట్టి మీరు అప్లై చేసే పోస్టులకు సంబందించిన అర్హతల యొక్క మార్క్స్ లిస్ట్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, కంప్యూటర్ సర్టిఫికెట్స్ వంటి వాటిని అప్లికేషన్ కి కలిపి సబ్మిట్ చెయ్యాలి. ఎటువంటి ఫీజు లేదు.

ఎలా అప్లై చెయ్యాలి?:

ఈ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి, 19-ఆగష్టు -2024 నుండి 02-సెప్టెంబర్ -2024 లోపు సంబందించిన డిపార్ట్మెంట్ కి వెళ్లి మీ అప్లికేషన్స్ ని ఆఫ్ లైన్ విధానంలో సబ్మిట్ చెయ్యాలి.

Notification & Application Form 1

Notification & Application Form 2

ఆంధ్రప్రదేశ్ విద్య, ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ Freejobsintelugu ని ప్రతి రోజూ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!