April 2026 New PAN Card Rules:
కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ కారణం వల్ల పాన్ కార్డు దరఖాస్తు చేసుకునేటువంటి ప్రక్రియలో చాలా మార్పులు సంభవించబోతున్నాయి.
మీకు ఇంకా పాన్ కార్డు లేకపోతే మార్చి 31వ తేదీలోగా ఉచితంగా ఆధార్ కార్డుతో పాన్ కార్డు పొందే అవకాశం ఉంది. అదే మీరు ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత పాన్ కార్డు తీసుకోవాలి అనుకుంటే మీరు అనేక పత్రాలు సమర్పించడమే కాకుండా చాలా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త చట్టం ప్రకారం ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఒకటే సరిపోదు దరఖాస్తుదారుడు తన పుట్టిన తేదీ ధ్రువీకరించడానికి అదనపు డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
అదే మీరు మార్చి 31వ తేదీలోగా పాన్ కార్డును తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు కేవలం ఐదు నిమిషాల్లో పాన్ కార్డు మీ మొబైల్ లోనే పొందే విధంగా అవకాశం ఉంది.
పాన్ కార్డు పొందే విషయంలో ముఖ్యమైన మార్పులు ఇవే:
- ఆధార్ తో పాటు ఈ పత్రాలు కూడా సమర్పించాలి: డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, పదవ తరగతి మార్క్స్ మెమో ఉండాలి
- మీ పేరులో మార్పులు ఉంటే: ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో ఆన్ అప్లికేషన్ లో కూడా అలాగే పేరు ఉండాలి. లేదంటే మీ యొక్క అప్లికేషన్ అంగీకరించబడదు
- కొత్త ఫారంలు: పాత Form 49A స్థానంలో కొత్తగా Form 94 రానుంది. ఏప్రిల్ 1 నుండి పాత ఫోరంలో చెల్లవు.
కొత్త చట్టం ప్రకారం ట్రాన్సాక్షన్ లిమిట్ లో మార్పులు వచ్చాయి:
కొత్త నిబంధన ప్రకారం డబ్బు లేదా నగదు లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డు సమర్పించాల్సిన పరిమితులను ప్రభుత్వం ఇటీవల సవరించింది. దీనివల్ల చాలా సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించినప్పటికీ, డాక్యుమెంటేషన్ మాత్రం కట్టిన తరం చేయడం జరిగింది.
| ట్రాన్సాక్షన్ రకం | పాత లిమిట్ | కొత్త లిమిట్ (2026) |
| స్థిరాస్తి కొనుగోలు | ₹10/- లక్షలు | ₹20 లక్షలు |
| వాహనాల కొనుగోలు | కచ్చితంగా తప్పనిసరి | ₹5 లక్షలు దాటితే |
| హోటల్ బిల్స్ | ₹50,000/- | ₹1/- లక్ష దాటితే |
| డబ్బు విత్డ్రా | పరిమితి తక్కువ | ₹10 లక్షలు దాటితే |
మొబైల్ ఫోన్లో పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి?:
మీ మొబైల్ ఫోన్ ద్వారానే పాన్ కార్డు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ క్రింది విధంగా అప్లై చేసుకోండి.
- ముందుగా ఇన్కమ్ టాక్స్ ఈ పోర్టల్ లోకి వెళ్ళండి.
- హోం పేజ్ లో “Instant E-PAN” ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి
- మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి ఓటిపి వెరిఫికేషన్ చేసుకోండి
- నీ వివరాలన్నీ కన్ఫామ్ చేసిన పది నిమిషాల్లోనే మీకు పాన్ కార్డు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం వస్తుంది
NOTE: మార్చి 31, 2026 తర్వాత చేస్తే మీరు బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కావున మార్చి 31వ తేదీలోగా కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి మీ మొబైల్ ద్వారానే.
మార్చి 31వ తేదీలోగా మీరు ఎందుకు పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి:
చాలామంది ప్రజలు పాన్ కార్డు అవసరం ఉన్నప్పుడు తీసుకుందాంలే అని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. కానీ ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చే ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 2025 వల్ల ప్రాసెస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్నటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతిని తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల మీరు మీ పాన్ కార్డు కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి మీసేవ లేదా ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి రావచ్చు కాబట్టి ఈ ఉచిత అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకొని పాన్ కార్డుకి మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.
పాన్ కార్డ్ కి సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శించండి.