Train Ticket Refund Rules:
రైలు ప్రయాణం చేసే ప్రజలకు ముఖ్యమైన అలర్ట్. రైల్వే శాఖ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకునేవారికి కొత్త రూల్స్ ని ప్రకటించడం జరిగింది. టికెట్ క్యాన్సిలేషన్ పాలసీని అప్డేట్ చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇక్కడ రైలు బయలుదేరే సమయానికి ఎన్ని గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేశారనే దానినిబట్టి చార్జీలు అలాగే రిఫండ్ నియమాన్ని ఐఆర్సీటీసీ మార్చేసింది. మీరు ట్రైన్ బయలుదేరే 8 గంటల లోపు టికెట్ని క్యాన్సిల్ చేస్తే మీకు రిఫండ్ రాదు. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి చూడండి.
IRCTC New Train Ticket Booking:
భారతదేశంలో రైలు ప్రయాణాలకు చాలామంది ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారు, అలాగే కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు విహారయాత్రలకు ఫ్యామిలీతో కలిసి లేదా స్నేహితులతో కలిసి వెళ్తూ ఉంటారు అలాగే తీర్థయాత్రలకు కూడా వెళుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో చాలామంది ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే కాస్త కంఫర్ట్ గా ప్రయాణం చేయవచ్చు అని ముందుగానే బుక్ చేసుకుంటారు. అలాగే ట్రైన్ టికెట్స్ కూడా ఇతర వాహన సదుపాయాలైనటువంటి ఫ్లైట్, బస్సు , కార్లు వంటి వాటితో పోలిస్తే చాలా తక్కువలో టికెట్స్ పొందవచ్చు. ఇలాగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వారికి భారత రైల్వే శాఖ ట్రైన్ టికెట్ చార్జీలు మరియు రిఫండ్ నిబంధనలో కీలక మార్పుల్ని చేస్తూ ప్రకటన జారీ చేసింది.
ఇందుకు అనుగుణంగా ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ విధానాన్ని సవరించడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో రైల్వే శాఖ కిలోమీటర్లను బట్టి ట్రైన్ టికెట్ చార్జీలని పెంచడం జరిగింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ అలాగే రిఫండ్ కి సంబంధించి కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా ట్రైన్ టికెట్లను అక్రమ విక్రయాల్ని అరికట్టేందుకుగాను, అలాగే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకు వస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తెలిపారు. ఇక్కడ కొత్త రూల్స్ ప్రకారం ప్రయాణ సమయానికి అంటే రైలు బయలుదేరే సమయానికి ఎంత ముందుగా టికెట్ క్యాన్సిల్ చేశారనే దానిపై ఆధారపడి టికెట్ చార్జీలు, రిఫండ్స్ వర్తిస్తాయి. ఈ సవరించిన నిబంధనలను ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమలు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు.
సవరించిన విధానం ప్రకారం కొత్త నిబంధనలు:
- ప్రయాణికులు రైలు బయలుదేరనున్న 72 గంటలలోగానే టికెట్స్ క్యాన్సిల్ చేస్తే కనీస క్యాన్సిలేషన్ ఫీజు మాత్రమే కోత విధిస్తారు. మిగతా మొత్తం డబ్బులు రిఫండ్ గా పొందవచ్చు. దీనిని మాక్సిమం రీఫండ్ గా పేర్కొనడం జరిగింది.
- ఇక రైలు బయలుదేరే 72 గంటల నుండి 24 గంటల్లోపు చూస్తే ఇక్కడ ట్రైన్ టికెట్ ఛార్జీలలో 25% వరకు కోత విధించి మిగతాది చెల్లిస్తారు.
- అలాగే ట్రైన్ బయలుదేరానున్న 24 గంటల నుండి 8 గంటల లోపు అయితే లేట్ క్యాన్సిలేషన్ కింద 50% వరకు క్యాన్సిలేషన్ ఛార్జ్ విధిస్తారు.
- రైలు బయలుదేరాల్సిన 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్లోజ్డ్ విండో కింద పరిగణించి, ఇక ప్రయాణికులకు రిఫండ్ ఏమి ఇవ్వరు.
Note: ఇక రైల్వే శాఖ ప్రయాణికులకు మరొక శుభవార్త కూడా చెప్పింది. ట్రైన్ బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికుల యొక్క బోర్డింగ్ పాయింట్ లేదా స్టేషన్ ని మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది. ఇక సిటీలో ఉండేవారు వారికి వీలుపడ్డ స్టాప్ లోనే ఎక్కేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తోంది.
దీనితోపాటు మరొక పెద్ద మార్పు కూడా తీసుకురాబోతోంది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే కన్ఫర్మ్ అయిన ట్రైన్ టికెట్లను క్యాన్సిలేషన్ రుషములు లేకుండానే రీ షెడ్యూల్ చేసుకునే కొత్త ఫీచర్ను త్వరలో రైల్వే శాఖ తీసుకొస్తున్నట్లు సమాచారం.