PM Ujjwala Yojana 2.0 2026:
భారత ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న ముఖ్యమైన పథకం PM Ujjwala yojana 2.0. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత LPG గ్యాస్ కనెక్షన్, మొదటి సిలిండర్ ఉచితం, అలాగే ప్రతి రీఫిల్ పై సబ్సిడీ కూడా అందుతుంది. ఇప్పుడు 2026 లో కూడా ఈ పథకం కొనసాగుతోంది.
• ఇప్పుడే అప్లై చేస్తే ₹300 వరకు లాభం పొందే అవకాశం ఉంది.
ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు:
- ఉచితంగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు
- మొదటి సిలిండర్ ఫ్రీగా పొందవచ్చు
- గ్యాస్ స్టవ్ కూడా ఉచితం
- ప్రతి రీఫిల్ పై ₹300 రూపాయలు సబ్సిడీ కూడా పొందవచ్చు
- మొత్తం ఖర్చు ₹550 నుండి ₹600 రూపాయల లోపే
ఎవరు అర్హులు?:
ఈ పథకం కోసం కింద ఉన్న అర్హతలు తప్పనిసరి.
- మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
- వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి
- ఇంట్లో ఇప్పటికే LPG కనెక్షన్ ఉండకూడదు.
- క్యాటగిరిలు:
- SC, ST
- PMAY లబ్ధిదారులు
- పేద కుటుంబాలకి చెందిన వారు.
అవసరమైన డాక్యుమెంట్స్
దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- బ్యాంక్ అకౌంట్ నెంబర్ + IFSC code
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
PM UJJWALA YOJANA 2.0 కోసం ఇలా అప్లై చేయండి
- అధికారిక వెబ్సైట్ https://pmuy.gov.in/ ఓపెన్ చేయండి.
- ” Apply for new Ujjwala Yojana 2.0 connection” పై క్లిక్ చేయండి
- మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కనెక్షన్ కంపెనీని ఎంపిక చేసుకోండి
- Indane Gas
- bharat gas
- hp gas
- మీ పూర్తి వివరాలు నమోదు చేయండి
- e-KYC పూర్తిచేయండి
- సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది.
ఎంత సబ్సిడీ వస్తుంది?:
- ప్రతి సిలిండర్ పై ₹300/- సబ్సిడీ వస్తుంది
- మార్కెట్ ధర ₹850/- ఉంటే మీరు ₹550/- కే పొందవచ్చు.
FAQ’s:
1. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది?
ఈ పథకంకి పేద మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
2. మగవాళ్ళు అప్లై చేయొచ్చా?
లేదు. మహిళల పేరుతో మాత్రం కనెక్షన్ ఇస్తారు
3. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉంటే వస్తుందా?
రాదు. మొదటిసారి కొత్తగా గ్యాస్ కనెక్షన్ పెట్టించుకునే వారు మాత్రమే అర్హులు