TTD Jobs Notification 2026:
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అధికారికంగా అహితాగ్ని మరియు ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా అర్హత కలిగినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విడుదలైన రెండు నోటిఫికేషన్ల యొక్క సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తిరుమల తిరుపతి దేవస్థానం |
| పోస్టుల పేర్లు | అహితాగ్ని, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ |
| అర్హతలు | MBBS, MD, ఇతర అర్హతలు |
| వయస్సు | 18 నుండి 42 |
| ఆఖరు తేదీలు | మార్చ్ 20, 2026 మార్చ్ 16, 2026 |
| అధికారిక వెబ్సైట్స్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విడుదలైన రెండు నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు అహితాగ్ని పోస్టులకు సంబంధించి సపరేట్ అర్హతలు కలిగి ఉండాలి, మరియు ప్రొఫెసర్ పోస్టులకు MBBS డిగ్రీ తో పాటు ఏదైనా స్పెషలైజేషన్లో MD చేసిన వారు అయితే దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండడంతో పాటు హిందూయిజాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఎంత శాలరీ ఉంటుంది?:
టీటీడీ నుండి విడుదలైన ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి ఎంపికైన వారికి నెలకు ₹15000 నుండి ₹74000 వరకు జీతాలు ఉంటాయి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ మాత్రమే చేస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
ఎలా అప్లై చేయాలి:
టీటీడీ నుండి విడుదలైన రెండు రకాల నోటిఫికేషన్లకు అర్హులైన అభ్యర్థులు క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి.
ముఖ్యమైన తేదీలు:
| మొదటి నోటిఫికేషన్ ఆఖరి తేదీ | మార్చి 20, 2026 |
| రెండవ నోటిఫికేషన్ ఆఖరి తేదీ | మార్చ్ 16, 2026 |
| మొదటి నోటిఫికేషన్ PDF & అప్లికేషన్ | Download |
| రెండవ నోటిఫికేషన్ PDF | Download |
| Official Website 1 | Click Here |
| Official Website 2 | Click Here |
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.