విజయవాడ ఎయిర్పోర్టులో AIASL ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2026 | 11 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | పూర్తి వివరాలు చూడండి

By: Sivakrishna Bandela

On: February 26, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Vijayawada Airport AIASL Trainee Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో పనిచేయడానికి AI AIRPORT SERVICES LIMITED (AIASL) వారు తాజాగా ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా passenger service agent (trainee) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి 11 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు ₹10,000/- రూపాయలు Stipend కూడా ఉంటుంది.

AIASL సంస్థ వివరాలు:

AIASL సంస్థ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ప్రముఖ సంస్థ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 80 కి పైగా ఎయిర్పోర్టులలో సేవలు అందిస్తోంది.

పోస్టుల వివరాలు:

  • పోస్ట్ పేరు : passenger service agent (Trainee)
  • పనిచేయవలసిన ప్రదేశం : విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
  • ట్రైనింగ్ కాలం: 11 నెలలు ట్రైనింగ్ ఇస్తారు
  • Stipend: ₹10,000/-

Job profile : ఏమేమి పనులు చేయవలెను:

ఎంపికైన అభ్యర్థులు టెర్మినల్ మరియు ర్యాంప్ ఏరియాలో ఈ క్రింది పనులను నిర్వహించవలెను.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details
  1. చెక్ ఇన్ మరియు బ్యాగేజ్ హ్యాండ్లింగ్
  2. టికెటింగ్ మరియు రిజర్వేషన్
  3. బ్యాగేజ్ మేకప్ / బ్రేకప్ ఏరియా పనులు
  4. కార్గో మానిఫెస్టింగ్
  5. ప్రయాణికుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ ( వీసా చెకింగ్ మొదలైనవి )
  6. కస్టమర్ సర్వీస్ మరియు కంప్లైంట్ హ్యాండ్లింగ్
  7. VIP గెస్ట్ హ్యాండ్లింగ్
  8. నైట్ షిఫ్టులతో సహా అన్ని షిఫ్టులలో పని చేయాలి

ఎంపిక చేసే విధానం?:

  • ఎంపిక విధానం పూర్తిగా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది
  • అర్హులైన అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ట్రైనీలుగా ఎంపిక చేస్తారు

వర్క్ షెడ్యూల్ :

  • వారానికి ఆరు రోజులు పని
  • మూడు షిఫ్ట్ ప్యాట్రన్స్ ఉంటాయి
  • ఒక పెయిడ్ వీక్లీ ఆఫ్ ఉంటుంది
  • ప్రతినెలా ఒక లీవ్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది

సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?:

ట్రైనింగ్ పూర్తయ్యాక అభ్యర్థుల యొక్క హాజరు మరియు పనితీరు సంతృప్తికరంగా ఉంటే, AIASL నుండి certificate of completion ఇవ్వబడుతుంది.

ఎవరు అర్హులు?. ఎలా అప్లై చేయాలి?:

ఈ నోటిఫికేషన్ ప్రకారం, వ్యక్తిగతంగా కాకుండా ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అభ్యర్థుల యొక్క జాబితా పంపించాలి.

సంబంధిత ఇన్స్టిట్యూట్ వారు ఈ క్రింది వివరాలు పంపించవలెను.

AP Home Guard Jobs Notification 2026 | AP Latest Jobs Notification 2026
  • అభ్యర్థి పేరు
  • వయస్సు
  • అభ్యర్థి అర్హతలు
  • అభ్యర్థి కాంటాక్ట్ వివరాలు
  • సంస్థ యొక్క అఫిలేషన్ డాక్యుమెంట్స్
  • పంపవలసిన ఈమెయిల్ అడ్రస్: officer.hrsr@aiasl.in
  • ఆఖరి తేదీ : 04 మార్చ్ 2026

Notification PDF

ముఖ్య గమనిక:

  1. ఈ నియామకం పూర్తిగా తాత్కాలికం
  2. ఈ ఉద్యోగం శాశ్వత ఉద్యోగం కాదు, ట్రైనింగ్ ఆధారిత అవకాశం మాత్రమే
  3. stipend ₹10,000/- మాత్రమే ఉంటుంది

ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఫీల్డ్ లో కెరియర్ ప్రారంభించాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు అర్హతలు ఉన్నట్లయితే పైన తెలిపినటువంటి వివరాల ప్రకారం గడువులోగా అప్లికేషన్స్ పంపించవలెను.

ఏపీలో పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Computer Operator Jobs 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page