రైల్వేలో 10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | Railway SECR Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 5, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway SECR Notification 2026:

సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుండి 54 గ్రూప్ సి మరియు గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి స్పోర్ట్స్ కోటా విధానంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హత కలిగి స్పోర్ట్స్ విభాగాల్లో పాల్గొన్నటువంటి సర్టిఫికెట్లు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ట్రయల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకుందాం.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే
పోస్టుల పేర్లు గ్రూప్ సి మరియు గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు54
అర్హతలు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్
లాస్ట్ డేట్9th ఫిబ్రవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతలతో పాటు క్రీడా విభాగాల్లో నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొని సర్టిఫికెట్లు పొందినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారు రైల్వే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

అప్లికేషన్ ఫీజు?:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీల వారిగా ఈ క్రింది ఫీజులు చెల్లించవలెను.

  • UR, EWS, OBC అభ్యర్థులు : ₹500/- ఫీజు చెల్లించాలి
  • SC, ST, PWD అభ్యర్థులు: ₹250/- ఫీజు చెల్లించాలి.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 45 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాలుగా ప్రభుత్వ అలవాన్సెస్ కూడా చెల్లిస్తారు.

ఎంపిక విధానం?:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొవాలి.
  2. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ట్రయల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  3. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
  4. మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు

ముఖ్యమైన తేదీలు?:

దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
నోటిఫికేషన్ విడుదల తేదీ డిసెంబర్ 31, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి 10, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 9, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ ద్వారా గడువులోగా దరఖాస్తులు చేసుకోండి.

Notification PDF

Apply Online

Official Website

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

రైల్వే ఉద్యోగాలు సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page