School Holidays:
తెలంగాణలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్కూల్ లకు హాలిడేస్ ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ మరియు ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలను వినియోగించనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు డిసెంబర్ 11, 14, 17 తేదీలలో సెలవులు ప్రకటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం వెలువడింది. మూడు రోజుల స్కూల్ హాలిడేస్ కి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
TG School Holidays 2025: అధికారిక తేదీలు:
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ పోలింగ్, ఎన్నికల ఏర్పాట్ల కారణంగా ఈ క్రింది మూడు రోజులలో సెలవులు ప్రకటించనున్నారు.
- 11వ తేదీ : స్కూల్స్ కి సెలవు
- 14వ తేదీ : స్కూల్స్ కి సెలవు
- 17వ తేదీ : స్కూల్స్ కి సెలవు
Note: ఈ సెలవులు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయి.

ఎందుకు పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు?:
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం:
- స్కూళ్లను పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించడం వల్ల
- స్కూల్ టీచర్లకు ఎన్నికల డ్యూటీ కేటాయించడం వల్ల
- బ్యాలెట్లు మరియు ఈవీఎంలను భద్రపరచడం కోసం
- ఎన్నికల భద్రత ఏర్పాట్ల కోసం
పైన తెలిపిన ఈ కారణాలవల్ల సాధారణ బోధనకు ఆటంకం కలిగే అవకాశం ఉండడంతో, స్కూళ్లకు ఆ మూడు రోజులపాటు సెలవులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
ఏ స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి?:
ఈ క్రింది తెలిపిన స్కూల్ అన్నిటికీ సెలవులు వర్తిస్తాయి.
- ప్రభుత్వ పాఠశాలలు
- ప్రైవేటు పాఠశాలలు
- మోడల్ పాఠశాలలు
- కేజీ నుండి పదవ తరగతి వరకు
అన్ని యాజమాన్య స్కూల్ లకు సెలవులు వర్తిస్తాయి.
ఉపాధ్యాయులకు కీలక సమాచారం:
- ఎక్కువ మంది టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ తప్పనిసరి.
- పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు టీచర్లకు విధులు ఉంటాయి.
- డ్యూటీకి హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం.
ఈ ప్రక్రియ మొత్తం భారత ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుంది.
విద్యార్థులు తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు?:
- విద్యార్థులు స్కూల్ నుండి వచ్చే అధికారిక నోటీసులు మాత్రమే నమ్మండి.
- వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు నమ్మవద్దు.
- ఎన్నికల తర్వాత క్లాసులు తప్పనిసరిగా రీ షెడ్యూల్ అవుతాయి.
మళ్లీ స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడు?:
- 17వ తేదీ తర్వాత యధావిధిగా స్కూల్స్ నిర్వహిస్తారు.
- జిల్లా విద్యాశాఖ అధికారి & జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం మళ్లీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి.
ముఖ్య గమనిక?:
ఇవి కేవలం ఎన్నికల కారణంగా వచ్చిన తాత్కాలిక సెలవులు మాత్రమే. ఎన్నికలు పూర్తయిన వెంటనే మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేయబడతాయి.
ఇలాంటి తాజా సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com వెబ్ సైట్ ని సందర్శించండి.