AP TET 2025 Exam:
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు 2,50,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తుల చేసుకున్న విషయం మీకు తెలిసిందే. రోజుకి రెండు షిఫ్టులవారీగా కంప్యూటర్ ఆదారిత పరిస్థితి నిర్వహించనున్నారు. ఉదయం మరియు మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే టెట్ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, కచ్చితంగా పాటించాల్సిన 20 ముఖ్యమైన సూచనల గురించి ప్రభుత్వం అభ్యర్థులకు తెలియపరచింది. ఆ సూచనలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.
అభ్యర్థులకు ముఖ్యమైన 20 సూచనలు ఇవే :
ఏపీ టెట్ రాతపరీక్షకు హాజరయ్య అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది సూచనలను పాటించవలసిందే.
- ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న టెట్ హాల్ టికెట్ మరియు ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా పరీక్ష హాల్ కి తీసుకుని వెళ్ళాలి.
- పరీక్ష హాల్ టికెట్లు ఇచ్చిన పరీక్ష కేంద్రానికి కనీసం 60 నిమిషాల ముందే చేరుకోవాలి.
- మొబైల్ ఫోన్ స్మార్ట్ వాచెస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పంటి వస్తువులు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లకూడదు వాటిని నిషేధించడం జరిగింది.
- బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే పరీక్ష కేంద్రానికి తీసుకునివెళ్లాలి.
- పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం సీరియల్ నెంబర్ చెక్ చేసుకోవాలి.
- పరీక్ష రాసేటప్పుడు పరీక్ష హాల్లో అభ్యర్థులు ఇతర వ్యక్తులతో మాట్లాడకూడదు.
- రిపోర్టింగ్ టైం దాటి వచ్చిన అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఉండదు కాబట్టి త్వరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి.
- పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్ కి కచ్చితంగా అభ్యర్థులు సహకరించాలి.
- పరీక్ష హాల్లో అనుమానాస్పదంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. కావున ఎవరి పరీక్ష వారు రాసుకోవాలి.
- పరీక్ష రాసే అభ్యర్థులు మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తే, మీరు మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- అభ్యర్థులు పరీక్షకు వచ్చేటప్పుడు సెల్ఫ్ నోట్ పేపర్లు తీసుకురాకూడదు.
- అభ్యర్థులు పరిష కేంద్రంలో అటెండెన్స్ షీట్ పై సంతకం తప్పనిసరిగా చేయాలి
- అభ్యర్థుల యొక్క పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రం నుండి బయటకు రాకూడదు
- పరీక్ష రాసేటప్పుడు ఇంకా పరీక్ష సమయం ఎంత ఉందో మీరే గమనించుకోవాలి
- ఇతర అభ్యర్థుల ప్రశ్నాపత్రంలోని సమాధానాలను మీరు కాపీ కొట్టే ప్రయత్నం చేయకూడదు.
- పరీక్ష రాసే సమయంలో మధ్యలో వాష్ రూమ్ కి వెళ్లే ప్రయత్నం చేయకూడదు.
- టెట్ పరీక్షకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చేంతవరకు అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ ని జాగ్రత్తగా దాచుకోవాలి.
- అభ్యర్థులు రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి.
- టెట్ పరీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫేక్ సమాచారాన్ని అభ్యర్థులు నమ్మకూడదు.
ఏపీ టెట్ 2025 పరీక్షల అభ్యర్థులకు చివరగా కీలక సూచన :
పరీక్షకు హాజరయ్యే రోజు అభ్యర్థులు మీరు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరైతేనే విజయం మీ వైపు ఉంటుంది. మీరు చేసే చిన్న తప్పు కూడా మీ యొక్క జీవిత లక్ష్యాన్ని దూరం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, పైన తెలిపిన 20 ముఖ్యమైనటువంటి సూచనలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించండి.
ఏపీ టెట్ 2025 పరీక్షకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి.