Telangana rythu Bharosa scheme 2025:
తెలంగాణ ప్రభుత్వం నూతన రైతు భరోసా పథకం 2025 ని, తెలంగాణలోని రైతన్నలకు ఆర్థిక భరోసాని అందించడమే లక్ష్యంగా రూపొందించడం జరిగింది. ప్రతి ఎకరాకు 12 వేల రూపాయల చొప్పున ( ఖరీఫ్ సీజన్ కు 6000 + రభి సీజన్ కు 6000 )రైతులకు చెల్లిస్తారు. ఈ డబ్బులతో రైతులు పంట పెట్టుబడికి ఉపయోగించి పంటలను పండించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జూన్ 16వ తేదీన రైతు భరోసా పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను విడుదల చేసి, వారి అకౌంట్లో డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు లబ్ధిదారుల జాబితాను సబ్మిట్ చేయడం జరిగింది. ఎకరం, రెండు, మూడు, నాలుగు, ఐదు ఎకరాల వారీగా రైతుల వివరాలను అందులో పేర్కొనడం జరిగింది.
రేపు అనగా జూన్ 16వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీలో తమ నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే రైతు నేస్తం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని రైతులందరికీ తీసుకొచ్చి ఆ సభకు హాజరు పరచడం జరుగుతుంది.
రైతు భరోసా పథకం ముఖ్యమైన విషయాలు :
- ఈ పథకం ద్వారా సీజన్ కి ₹6000 రూపాయలు చొప్పున రభి సీజన్కు ₹6000 ఖరీఫ్ సీజన్కు ₹6000 మొత్తం ₹12,000 రైతులకు ఆర్థిక సహాయం అందిస్తారు.
- గతంలో మూడు ఎకరాల వరకు మాత్రమే డబ్బులుజమ చేసేవారు.కానీ ఇప్పుడు నాలుగు నుండి పది ఎకరాలను ఉన్నా కూడా పథకం వర్తిస్తున్నారు.
TS 10th సప్లీమెంటరీ రిజల్ట్స్ 2025 విడుదల తేదీ
ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు :
- తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతు అయి ఉండాలి.
- లబ్ధిదారుడికిఆధార్, బ్యాంక్ పాస్ బుక్, పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం ఉండాలి
- కుటుంబ ఆదాయం ప్రభుత్వ పరిమితిలో ఉండాలి
ఎలా అప్లై చేయాలి?:
- గ్రామ వ్యవసాయ అధికారి లేదా రైతు సమాఖ్య ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
- అవసరమైనటువంటి పత్రాలను వాలిడేషన్ కోసం సబ్మిట్ చేయండి.
- అధికారులు అన్ని పత్రాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు.
- అప్పుడు ఈ పథకానికి అర్హత కలిగిన వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు.
TS ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ రిజల్ట్స్ 2025 16th జూన్ విడుదల
లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?.
- ముందుగా లబ్ధిదారులు అధికారిక వెబ్సైట్ https://www.rythubharosa.telangana.gov.in ఓపెన్ చేయండి
- ” Beneficiary list/ అర్హుల జాబితా ట్యాబ్ ఓపెన్ చేయండి
- జిల్లా మండలం గ్రామం ఎంచుకొని సెర్చ్ చేయండి.
- మీ పేరు మరియు సంబంధిత వివరాలు చూడండి
- లిస్టులో మీ పేరు లేకపోతే మీ గ్రామ వ్యవసాయ అధికారిని సంప్రదించండి.
ముఖ్యమైన విషయం:
- ఈసారి రైతు భరోసా వితరణలో 10 ఎకరాలు వరకు ఒకేసారి డబ్బులు జమ చేయాలనీ ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది.
- వన్ స్టాప్ అనుభవం కోసం గ్రామంలో రైతు నేస్తం విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.