AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడికి వెళ్లే పిల్లల తల్లులకు అందించే తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.లబ్ధిదారులైనా కొంతమంది తల్లుల బ్యాంక్ అకౌంట్స్ ఆక్టివేట్ లో లేకపోవడం వల్ల అర్హులైన వారికి డబ్బులు ఎకౌంట్లో డిపాజిట్ కావడం లేదని, అర్హులైన లబ్ధిదారులు తమ యొక్క బ్యాంకు ఖాతా స్టేటస్ మరియు యాక్టివేషన్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని తెలిపారు. అలా బ్యాంక్ అకౌంట్ ని ఆక్టివేట్ చేసిన లబ్ధిదారుల అకౌంట్ లో వెంటనే డబ్బులు డిపాజిట్ అవుతాయని, ఆక్టివేట్ లో లేకపోవడం వల్ల చాలామంది అభ్యర్థుల డబ్బులు గవర్నమెంట్ కి రిటన్ లో వస్తున్నాయని ఆయన తెలపడం జరిగింది.
తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్నవారు ఎవరు?:
- ఈ పథకానికి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న స్కూల్ పిల్లలతో పాటు, ఇంటర్మీడియట్ చదువుతున్న కాలేజీ విద్యార్థుల తల్లులు కూడా అర్హులు.
- తల్లి పేరు మీద బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
- గత ప్రభుత్వం 42 లక్షల మందికి లబ్ధి చేకూరిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం 67 లక్షల మంది పనులకు లబ్ధి చేకూర్చింది.
కొత్తగా ఎవరైనా ఎలా అప్లై చేయాలి?:
తల్లికి వందనం పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
ఏపీ తల్లికి వందనం పథకం అర్హులు మరియు అనర్హుల జాబితా లిస్ట్
- ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM వెబ్సైట్లోకి వెళ్ళండి
- ఆ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు లేదా
- ఇంకా సౌకర్యంగా ఉండడం కోసం మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు.
- తల్లి పేరు విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు నెంబర్, తల్లి బ్యాంకు ఖాతా నెంబర్, ఇతర సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేయాలి.
- గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మీ యొక్క కొత్త అప్లికేషన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది.
లబ్ధిదారులు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:
- గతంలో గాని లేదా కొత్తగా గాని తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గ్రామ సచివాలయంలో మీరు అర్హులా కాదా అనేటువంటి స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
- సచివాలయానికి వెళ్లి సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారిని సంప్రదించి Eligible, Ineligible స్టేటస్ లిస్టులో ఈ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
- ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే కచ్చితంగా మీకు డబ్బులు డిపాజిట్ అవుతాయి.
- Ineligible లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే, తప్పులను సవరించుకొని మళ్ళీ అప్లై చేయండి.
Eligible, Ineligible లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి?:
ఏపీ తల్లికి వందనం పథకం 13 వేల రూపాయలు డిపాజిట్ అవుతున్నాయి : Check Details
- గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించండి.
- వారు GSWS హోటల్ ద్వారా మీ స్టేటస్ చెక్ చేసి ఎలిజిబిలిటీ లిస్టు చూపిస్తారు.
- ఈ పథకం కింద మీ పేరు ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అర్హులు లేదంటే మీరు అనర్హులు.
డబ్బులు పడలేదు! కారణం ఇదే కావచ్చు?:
మంత్రి నారా లోకేష్ చెప్పినట్లుగా :
- కొంతమంది తల్లిలా బ్యాంకు ఖాతాలు ఆక్టివేట్ కాలేదు.
- NPCI మ్యాపింగ్ లేకపోవడం వల్ల డబ్బులు డిపాజిట్ కాలేదు
- ఇలాంటి సమస్యలు ఉన్న లబ్ధిదారులు వెంటనే మీ బ్యాంకుకు వెళ్లి ఖాతాను ఆక్టివేట్ చేయించుకోవాలి.
పథకం ముఖ్యమైన తేదీలు:
| విషయం | తేదీ |
| పథకం ప్రారంభమైన తేదీ | జూన్ 12,2025 |
| డబ్బులు డిపాజిట్ ప్రారంభమైన తేదీ | జూన్ 13, 2025 |
| స్టేటస్ చెక్ లేదా లిస్టులు | జూన్ 14 నుండి ప్రారంభం |
ఈ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మీరు ఇచ్చిన వివరాల్లో ఎటువంటి తప్పులు లేకుండా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ లో ఉండాలి. మీరు లేటుగా అప్లై చేసినా కూడా వారికి డబ్బులు తర్వాత డిపాజిట్ కావడం జరుగుతుంది. మీ స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకుని, ఈ వివరాలను మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.