Junior Assistant Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీలో 14 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులని కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాల వరకు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 15th మార్చ్ 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 31st మార్చ్ 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 03, 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
HPCL లో భారీగా ఉద్యోగాలు :Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ నుండి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ 14 పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్ జనరల్ నౌలెడ్జి బిట్స్ వస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. ఇతర రెసర్వేషన్ ఉన్న అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగ దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి. TA, DA, HRA వంటివి ఉంటాయి.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.