పోస్టల్ శాఖలో కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ డాక్ మిత్రాల నోటిఫికేషన్ | Postal Dak Mithra Jobs Notification 2025 | Freejobsintelugu

Postal Jobs New Notification 2025:

పోస్టల్ శాఖ నుండి కొత్తగా డాక్ మిత్ర అనే పోస్టులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో భర్తీ చేయడానికి డాక్ మిత్ర పోస్టులను విడుదల చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సర్వీసెస్ కల్పిస్తు కమిషన్ పొందే విధంగా అవకాశం కల్పిస్తారు. డాక్ మిత్ర ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

పోస్టల్ శాఖ డాక్ మిత్ర సర్వీసెస్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏమీ తెలుపలేదు. అభ్యర్థులు ఆన్లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

పోస్టులు వివరాలు, అర్హతలు:

తపాలా శాఖ నుండి డాక్ మిత్ర పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన పురుషులు, మహిళా అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. సొంత గ్రామంలోనే ఉద్యోగం వస్తుంది.

మున్సిపల్ కార్పొరేషన్ లో 705 గవర్నమెంట్ జాబ్స్: Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు డాక్ మిత్రాలుగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు ఉంటుంది.

సెలక్షన్ చేసే విధానం, జాబ్ ప్రొఫైల్:

డాక్ మిత్ర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పోస్టుల్ సర్వీసెస్ గురించి అవగాహన కల్పిస్తూ వారికి ఆ పోస్ట్ల్ ప్రొడక్ట్స్ ని సేల్ చెయ్యాలి.పోస్టల్ పార్సెల్స్, స్పీడ్ పోస్ట్స్ లను తీసుకొని గ్రామ ప్రజలకు అందించాలి.

కుటుంబ సంక్షేమ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ : ఇంటర్ అర్హత

శాలరీ /కమిషన్ ఎంత?:

డాక్ మిత్రలుగా పోస్టల్ సేవలు అందించే అభ్యర్థులకు నెలకు కమిషన్ రూపంలో ₹10,000/- నుండి ₹20,000/- వరకు సంపాదించుకోవచ్చు. ఇతర అలవెన్సెస్, బెనిఫట్స్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

10వ తరగతి అర్హత సర్టిఫికెట్స్, స్థానికత తెలిపే రిజడెన్సీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP సర్వేయర్ ఉద్యోగాలు : Apply

ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి:

పోస్టల్ శాఖ డాక్ మిత్ర ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Whats App Group

Notification & Apply Link

CSC ID Apply Details & Link

పోస్టల్ కొత్త ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకువచ్చు.

Leave a Comment

error: Content is protected !!