AP Agriculture Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ శాఖకు సంబందించిన ఆచార్య NG రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి 05 టెక్నికల్ అసిస్టెంట్, 04 ఫీల్డ్ అసిస్టెంట్, 01 ట్రాక్టర్ డ్రైవర్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఏదైనా డిగ్రీ, డిప్లొమాలో అర్హతలు కలిగినవారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫీజు లేకుండా 28th జనవరి 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
AP వ్యవసాయ క్షేత్రం ANGRAU యూనివర్సిటీ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు గుంటూరు జిల్లాలోని ANGRAU యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నందు 28th జనవరి 2025 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
పోస్టులు వివరాలు వాటి అర్హతలు:
టెక్నికల్ అసిస్టెంట్: 05 పోస్టులు : బాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చర్ 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
ఫీల్డ్ అసిస్టెంట్ : 04 పోస్టులు : ఏదైనా BSC/పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ / సీడ్ టెక్నాలజీలో అర్హతలున్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ట్రాక్టర్ డ్రైవర్: 01 పోస్టులు : 10వ తరగతి అర్హత కలిగి డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు అర్హులు.
UCO బ్యాంక్ లో 250 Govt జాబ్స్: Any డిగ్రీ
సెలక్షన్ ప్రాసెస్:
అర్హులైన అభ్యర్థులకు 28th జనవరి 2025 రోజున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ANGRAU యూనివర్సిటీ, లాం, గుంటూరు జిల్లాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదు.
ఎంత వయస్సు ఉండాలి:
వ్యవసాయ శాఖ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
కోల్ ఇండియాలో 434 గవర్నమెంట్ జాబ్స్ : అప్లై
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి హాజరయ్యే వారికి ఎటువంటి TA, DA చెల్లించరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్
Age ప్రూఫ్ డాక్యుమెంట్స్
డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.
AP ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి 250+ Govt జాబ్స్: Apply
ఎలా Apply చెయ్యాలి:
AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ANGRAU ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.