TGSRTC Notification 2024:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి 1201 డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. మాజీ సైనికులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు 58 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్నవారికి వారు కోరుకున్న డిపోలో జాబ్స్ వచ్చేలాగా చేస్తారు. నెలకు ₹26,000/- జీతాలతోపాటు, ₹150/- రోజువారీ అలవెన్సెస్ కూడా ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ పంపించే విధానం:
TGSRTC ఉద్యోగాలకు అర్హతలున్న మాజీ సైనిక్ ఉద్యోగులు నవంబర్ 30వ తేదీలోగా TGSRTC వారు ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు అప్లికేషన్స్, డాక్యుమెంట్స్ ని @మెయిల్ చేస్తే చాలు. [email protected] లేదా [email protected] కు మెయిల్ చేయాలని తెలంగాణాలోని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ తెలిపారు. మీ అప్లికేషన్స్, డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి ఒక pdf ఫైల్ చేసి ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు గడువులోగా ఆన్లైన్ లో అభ్యర్థి యొక్క మెయిల్ నుండి పంపించవలెను.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
TGSRTC నుండి విడుదలయిన 1201 డ్రైవర్ పోస్టులకు మాజీ సైనిక్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 58 సంవత్సరాలలోపు వయస్సు కలిగి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
విజయవాడ ఎయిర్ పోర్టుల్లో 277 ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మాజీ సైనిక్ అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తూ సెలక్షన్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులు కోరిన డిపోలోనే పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹26వేలు జీతాలు చెల్లిస్తారు. అలాగే రోజువారీ అలవెన్సెస్ కింద ₹150/- చెల్లిస్తారు.
సికింద్రాబాద్ రైల్వేలో గ్రూప్ C, D గవర్నమెంట్ జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే మాజీ సైనిక అభ్యర్థులకు 58 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
కావలసిన డాక్యుమెంట్స్:
tgsrtc ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి
రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
మాజీ సైనికుల సర్టిఫికెట్స్ ఉండాలి.
హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
డ్రైవింగ్ అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
రోడ్డు రవాణా శాఖలో 500* గవర్నమెంట్ జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ నుండి విడుదలయిన డ్రైవర్ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లికేషన్స్ [email protected] లేదా [email protected] చెయ్యాలి. నవంబర్ 30వ తేదీలోగా పంపవలెను.
TGSRTC ఉద్యోగాలకు తెలంగాణాలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోగలరు.