NTPC Notification 2024:
నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థ నుండి 30 డిప్లొమా ట్రైనీ, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్లొమా, BSC డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
డిప్లొమా ట్రైనీ : 24 పోస్టులు : ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ల్యాబ్ అసిస్టెంట్ : 06 పోస్టులు : Bsc కెమిస్ట్రీ లో అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి :
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాలమధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
గ్రామీణాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
దరఖాస్తు తేదీలు:
25th సెప్టెంబర్ 2024 నుండి 10th అక్టోబర్ 2024 తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. వేరే విధానంలో వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు. నోటిఫికేషన్ లో ఇచ్చిన గడువులోగా ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.
ఎలా ఎంపిక చేస్తారు:
అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు 50 మార్కులకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మరో 70 మార్కులకు సంబందించిన విభాగం నుండి ప్రశ్నలు వస్తాయి. అప్టిట్యూడ్, రీసినింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి, సబ్జెక్టు ప్రశ్నలు వస్తాయి.
శాలరీ ఎంత ఉంటుంది:
ముందుగా ఎంపిక అయిన వారికి ₹24,000/- శాలరీ ఉంటుంది. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసినవారికి ₹60,000/- జీతం చెల్లిస్తారు. ఇతర TA, DA, HRA వంటి అన్ని అలవెన్స్ లు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆన్లైన్o అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యడానికి ₹300/- ఫీజు చెల్లించాలి. SC, ST, pwd, ex servicemen, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
ఎలా అప్లికేషన్ చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్ ఆధారంగా దరఖాస్తులు చేసుకోగలరు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.