Telangana 1300 Govt Jobs :
తెలంగాణా సంక్షేమ శాఖకు సంబందించిన మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు, ఇతర అర్హతల ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి సర్టిఫికెట్ కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు అర్హత ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి గడువులోగా ధరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 21/09/2024
ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ : 05/10/2024
రాత పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష ): నవంబర్ 10th, 2024.
విడుదల చేసిన ఉద్యోగాలు, వాటి అర్హతలు:
తెలంగాణా సంక్షేమ శాఖ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1284 ప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేశారు. ఇందులో తెలంగాణా వైద్య విధాన పరిషత్ లో 183 పోస్టులు, MNJ క్యాన్సర్ సెంటర్ లో 13 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 1, 088 పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు మెడికల్ లేబరేటరీ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
01/07/2024 నాటికీ 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. Pwd అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంత ఫీజు చెల్లించాలి:
ఆన్లైన్ ఎక్సమినేషన్ ఫీజు ₹500/-, ప్రాసెసింగ్ ఫీజు ₹200/- చొప్పున చెల్లించాలి. SC, ST, BC, EWS, PHC, EX సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
80 మార్కులు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించీ మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు గవర్నమెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఇస్తారు. గవర్నమెంట్ సర్వీస్ చేసిన అనుభవం కలిగిన అభ్యర్థులకు ఎక్కువగా ప్రాధన్యత ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికెట్స్, డిగ్రీ మార్క్స్ మెమో, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ లోనే ₹40,000/- జీతాలు ఉంటాయి. అన్ని అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు. TA, DA, HRA కూడా ఉంటుంది.
ఎలా Apply చెయ్యాలి:
అర్హతలు కలిగిన అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్, దరఖాస్తు లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.
తెలంగాణా ఉద్యోగాల సమాచారం కోసం ప్రతి రోజూ మా వెబ్సైటుని సందర్శించండి.